Kiran Abbavaram KA Theatrical Rights :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం పాన్ ఇండియాలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈయన నటించిన 'క' అనే చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో వివిధ భాషలకు చెందిన డిస్ట్రీబ్యూషన్ రైట్స్‌ను కొనుగులో చేసేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా మలయాళ రిలీజ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆ భాషలో ఈ చిత్రాన్ని స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వేఫేరర్ ఫిల్మ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. తాజాగా ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇది విన్న ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 'క'కి ఇతర భాషల్లోనూ మంచి ఆదరణ దక్కలని కోరుతున్నారు.
ఇక 'క' సినిమాలో కిరణ్ అబ్బవరంతో పాటు నయన్ సారిక, తన్వీ రామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం భారీగా రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడికల్ సినిమాను సుజీత్, సందీప్ డైరెక్ట్ చేశారు. ఇటీవలే వచ్చిన టీజర్, సాంగ్స్ కూడా మూవీ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది.