Highest Paid Malayalam Actor :మలయాళ సినీ ఇండస్ట్రిలో మమ్ముట్టి , మోహన్‌లాల్ లాంటి సూపర్ స్టార్స్ ఉన్నారు. ఇప్పటి తరం హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, ఫహాద్ ఫాజిల్, టోవినో థామస్ కూడా తమ నటనతో మలయాళ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఓ స్టార్ హీరో వీళ్లందరినీ బీట్ చేస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరంటే ?
ఇంతకీ ఆయన ఎవరో కాదు మల్లు నటుడు మోహన్‌లాల్. మలయాళంలో మెస్ట్ సక్సెస్ఫుల్ యాక్టర్స్‌లో ఒకరైన ఈయన మాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు, తమిళంలోనూ నటించి గుర్తింపు పొందారు. అయితే ఆయన ప్రతి సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ 8 కోట్లు నుండి 17 కోట్లు మధ్యలో ఉంటుందని టాక్ నడుస్తోంది.
గతేడాది రజనీకాంత్ లీడ్ రోల్లో వచ్చిన 'జైలర్' సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు మోహన్ లాల్. ఆ సినిమాలో నటించిన కొద్ది నిమిషాలకే ఆయన దాదాపు రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇక సీనియర్ నటుడు మమ్ముట్టి కూడా తన ప్రతి సినిమాకు ఆయన పాత్ర నిడివి బట్టి దాదాపు రూ. 4 కోట్లు నుంచి రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారని సమాచారం.
మరోవైపు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా పాపులరే. ఆయన కూడా తన పాత్ర డిమాండ్ బట్టి సినిమాకు రూ. 3 నుంచి రూ.8 కోట్ల వరకు తీసుకుంటారని అంచనా.