Bollywood Heroine Deepika Padukone Yellow Dress: బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆన్ స్క్రీన్ తనదైన నటనతో అలరించే ఈ బ్యూటీ.. ఆఫ్ స్క్రీన్‌లోనూ తనదైన వ్యక్తిత్వం ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా ఈమె చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
దీపికా పదుకొణే సినిమాల్లో నటించడంతోపాటు బిజినెస్ రంగంలోకి కూడా ప్రవేశించింది. సొంతంగా ఫ్యాషన్ బిజినెస్ రన్ చేస్తోంది. తాజాగా తన సొంత ఫ్యాషన్ బిజినెస్ "82 ఈస్ట్ ఆఫ్‌లైన్ స్టోర్"లో షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో దీపిక ఎల్లో కలర్ గౌన్‌లో ఎంతో అందంగా మెరిసిపోయింది. ఫ్యాషన్ ప్రియులు కూడా దీపిక డ్రెస్‌ను తెగ మెచ్చుకున్నారు. అయితే.. ఆ డ్రెస్‌ను అమ్మేసిందీ బాలీవుడ్ నటి. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ డ్రెస్ అమ్మకానికి ఉందని చెబుతూ ఒక ఫోటోను పంచుకుంది దీపిక. ఆ ఫోటో షేర్ చేసిన నిమిషాల్లోనే అమ్ముడుపోయింది.
20 నిమిషాల్లోనే:ఫొటో పోస్ట్ చేసిన 20 నిమిషాల్లోనే ఎల్లో గౌన్ 34 వేల రూపాయలకు అమ్ముడుపోయింది. దీంతో దీపిక వెంటనే ఎల్లో గౌన్ డ్రెస్ సోల్డ్ ఔట్ అని మరో ఫొటో షేర్ చేసింది. అయితే.. ఈ డ్రెస్ అమ్మగా వచ్చిన రూ.34,000 నగదును సామాజిక సేవ కార్యక్రమాల కోసం వినియోగించనుంది దీపిక. "ద లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్" పేరుతో నిర్వహిస్తోన్న చారిటీ సంస్థకు ఈ నగదును అంజేయనున్నారు ఈ అందాల తార. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు దీపికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీపికలాగే ఆమె ఆలోచనలు కూడా చాలా అందంగా ఉన్నాయంటున్నారు. మీరు చాలా గ్రేట్ మేడమ్ అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.