తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

Updated : 5 hours ago

ETV Bharat / business

రూ.78వేలు దాటిన బంగారం - రూ.94వేలకు చేరువలో వెండి ధరలు! - Gold Rate Today

Gold Rate Today September 27, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలకు రెక్కలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate
Gold Rate (AFP)

Gold Rate Today September 27, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు రోజురోజుకూ భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.77,800 ఉండగా, శుక్రవారం నాటికి రూ.285 పెరిగి రూ.78,085కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.93,360 ఉండగా, శుక్రవారం నాటికి 381 పెరిగి రూ.93,741కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad September 27, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.78,085గా ఉంది. కిలో వెండి ధర రూ.93,741గా ఉంది.
  • Gold Price In Vijayawada September 27, 2024 :విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,085గా ఉంది. కిలో వెండి ధర రూ.93,741గా ఉంది.
  • Gold Price In Visakhapatnam September 27, 2024 :విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,085గా ఉంది. కిలో వెండి ధర రూ.93,741గా ఉంది.
  • Gold Price In Proddatur September 27, 2024 :ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,085గా ఉంది. కిలో వెండి ధర రూ.93,741గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price September 27, 2024 :అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2662 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 10 డాలర్లు పెరిగి 2672 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 31.92 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 27, 2024 :శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.44,30,000
ఇథీరియం రూ.1,92,710
టెథర్ రూ.78.1
బైనాన్స్ కాయిన్ రూ.39,000
సొలోనా రూ.7,302

స్టాక్​ మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today September 27, 2024 :శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా ప్రారంభమయ్యాయి. కానీ ట్రేడింగ్​ ప్రారంభంలోనే బీఎస్​ఈ సూచీ సెన్సెక్స్​ 85,955 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. ఐటీ స్టాక్స్​ రాణిస్తుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం వల్ల స్టాక్ మార్కెట్లు క్రమంగా లాభాల్లోకి దూసుకెళ్తున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడి 85,941 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 26,263 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా, హెచ్​సీఎల్​ టెక్​, టీసీఎస్​, సన్​ఫార్మా, టాటా స్టీల్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, టైటాన్​, ఏసియన్ పెయింట్స్​, ఎస్​బీఐ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : పవర్​గ్రిడ్​, ఎల్ అండ్ టీ, భారతీ ఎయిర్​టెల్​, బజాజ్ ఫైనాన్స్​, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​

రూపాయి విలువ
Rupee Open September 27, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 3 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.63గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices September 27, 2024 :తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధరలు
Brent Crude Oil Prices September 27, 2024 :అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్‌ ధరలు 0.24 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధర 71.43 డాలర్లుగా ఉంది.

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details