తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యువకుడిపై కత్తితో దారుణంగా దాడి- బైక్​కు కట్టేసి ఈడ్చుకెళ్లి హత్య - యువకుడిని బైక్​కు కట్టేసి ఊరేగింపు

Youth Tied And Dragged By Bike : ఓ యువకుడిని కత్తితో దారుణంగా పొడిచి, బైక్​కు కట్టేసి గ్రామమంతా ఈడ్చుకెళ్లారు ఇద్దరు వ్యక్తులు. అనంతరం పోలీస్​స్టేషన్ వద్ద బాధితుడిని వదిలేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిందీ ఘటన.

Youth Tied And Dragged By Bike
Youth Tied And Dragged By Bike

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 6:31 PM IST

Youth Tied And Dragged By Bike : ఉత్తర్​ప్రదేశ్​లోని నొయిడాలో ఓ యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు ఇద్దరు వ్యక్తులు. కత్తితో దారుణంగా పొడిచి తమ బైక్​కు కట్టేసి గ్రామమంతా ఈడ్చుకెళ్లారు నిందితులు. అనంతరం పోలీస్​స్టేషన్​ వద్ద వదిలి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. బాధితుడిని మెహందీ హసన్‌గా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం-నొయిడా జిల్లాలోని బరౌలాకు చెందిన నిందితులు అనూజ్, నితిన్‌ అదే గ్రామానికి చెందిన మెహందీ హసన్​తో ఒక చిన్న విషయంపై శనివారం అర్ధరాత్రి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత కత్తితో హసన్​ను గాయపరిచారు. యువకుడిని తమ ద్విచక్రవాహనానికి కట్టేసి గ్రామంలో వీధుల్లో ఈడ్చుకెళ్లారు. అలా పోలీస్​స్టేషన్​ వద్దకు వెళ్లి బాధితుడిని అక్కడ వదిలేసి పరారయ్యారు.

వెంటనే బాధితుడిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కానీ లాభం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ యువకుడు ఆస్పత్రిలో మరణించాడు. అయితే యువకుడిని బైక్​కు కట్టి ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

నిందితులిద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులపై నిందితులు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపగా ఇద్దరూ గాయపడ్డారు. అనంతరం నిందితులను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే 2018లో తన తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకునేందుకే అనూజ్ ఈ దారుణమైన చర్యకు పాల్పడ్డినట్లు ఓ అధికారి తెలిపారు.

కొన్నిరోజుల క్రితం,కర్ణాటకలోని బెళగావి జిల్లాలో కుమారుడు ప్రేమించిన యువతితో పారిపోయాడని అతడి తల్లిని వివస్త్రను చేసి స్తంభానికి కట్టేశారు. గ్రామంలో ఊరేగించినట్లు కూడా తెలిసింది. ఓ 24 ఏళ్ల యువకుడు, మరో యువతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో యువతిని తీసుకుని ఆమె ప్రియుడు పారిపోయాడు. అప్పుడు యువకుడి తల్లిపై యువతి తరఫువారు దాదాపు 8నుంచి 10 మంది దాడికి పాల్పడ్డారు. అనంతరం మహిళను వివస్త్రను చేసి, స్తంభానికి కట్టేశారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరో దారుణం.. ఇద్దరు గిరిజన మహిళలను చితకబాది.. నగ్నంగా మార్చి..

గిరిజన మహిళపై దారుణం.. నగ్నంగా మార్చి.. గ్రామమంతా ఊరేగించిన భర్త.. అత్తమామలు కూడా!

ABOUT THE AUTHOR

...view details