తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రుతుపవనాల రాకను తెలిపే జగన్నాథుడి గుడి- ఎక్కడ ఉందో తెలుసా? - Temple Predicts Rain - TEMPLE PREDICTS RAIN

Temple Predicted Monsoon : రుతుపవనాల రాకను ఆలయ గోపురంలోని రాళ్లు అంచనా వేస్తాయట. వర్షపాతం ఎంతమేర నమోదవుతుందో తెలుపుతాయట. మరెందుకు ఆలస్యం ఆ గుడి ఎక్కడ ఉందో? రుతుపవనాల రాకను ఎలా అంచనా వేస్తాయో? తెలుసుకుందాం.

Temple Predicted Monsoon
Temple Predicted Monsoon (Source : ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 3:51 PM IST

రుతుపవనాల రాకను తెలిపే జగన్నాథుడి గుడి (Source : ETV Bharat)

Temple Predicted Monsoon :సాధారణంగా వాతావరణ శాఖ రుతుపవనాలు రాకను అంచనా వేస్తుంది. వర్షాలు ఎంతమేర కురుస్తాయో కూడా తెలుపుతుంది. అయితే ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లోని జగన్నాథుడి ఆలయం కూడా రుతుపవనాలను అంచనా వేస్తుందట. వర్షపాతం ఎంతో చెప్పగలుగుతుందట. ఈ రహస్యాన్ని తెలుసుకునేందుకు పలువురు శాస్త్రవేత్తలు కూడా ఆలయాన్ని వెళ్లి పరిశోధనలు చేశారు. మరెందుకు ఆలస్యం ఈ పురాతన దేవాలయం ఎలా రుతుపవనాలను అంచనా వేస్తుందో తెలుసుకుందాం.

ఆలయంలో జగన్నాథుడు (Source : ETV Bharat)

కాన్పుర్​కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెహతా గ్రామంలో జగన్నాథుడి ఆలయం ఉంది. ఈ గుడిలో జగన్నాథుని విగ్రహమే కాకుండా అనేక ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయ గోపురంలోని రాళ్లు రుతుపవనాల రాకను అంచనా వేస్తాయని ఆలయ మహంత్ కేపీ శుక్ల 'ఈటీవీ భారత్'​కు చెప్పారు.

"రుతుపవనాలు ప్రారంభమైన వెంటనే ఆలయ గోపురంలోని రాయి తడిగా అవుతుంది. ఇలా అయ్యిందంటే వర్షాలు పడతాయని ప్రజలకు అంచనా. రాయిపై నీరు చుక్కల రూపంలో వస్తే అది సాధారణ వర్షానికి సూచన. రాయి నుంచి కొద్దిగా ఎక్కువగా నీరు కారితే అప్పుడు భారీ వర్షం పడుతుందని అంచనా. ఈసారి రాయిపై నీరు ఎక్కువగానే కారింది. అంటే ఈ ఏడాది ఎక్కువ వర్షాలు కురుస్తాయి.

-- కేపీ శుక్ల

"ఈ ఆలయం ఒడిశాలో పూరి జగన్నాథుని గుడి కంటే పురాతనమైనది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎడమ వైపున సూర్యభగవానుడు, కుడి వైపున విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాలు చాలా పురాతనమైనది. ఈ ఆలయ నమూనా ఉత్తర భారతదేశంలోని ఏ దేవాలయంలో కనిపించదు. ఈ ఆలయంలో మౌర్యులు, గుప్తులు రాజవంశం తాలుక ఆధారాలు కనిపిస్తాయి. సింధు లోయ, హరప్పా కాలం నాటి బొమ్మలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. అందుకే ఈ ఆలయం నిర్మితమై వందల ఏళ్లు అయ్యి ఉంటుందని అంచనా. రుతుపవనాల అంచనా రహస్యాన్ని ఛేదించడానికి చాలా మంది శాస్త్రవేత్తలు ఈ ఆలయానికి వచ్చారు. కానీ రహస్యం ఏమిటో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు" అని ఆలయ మహంత్ కేపీ శుక్ల తెలిపారు.

జగన్నాథుడి ఆలయ గోపురం (Source : ETV Bharat)

'నీటి తేమ వల్లే'
తాను రెండు సార్లు జగన్నాథుని ఆలయాన్ని సందర్శించానని, అక్కడి రాళ్లపై తేమ వల్ల నీటి చుక్కలు కనిపిస్తాయని చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ యూనివర్శిటీ వాతావరణ నిపుణుడు ఎస్ ఎన్ సునీల్ పాండే చెప్పారు. ఇలా రాళ్లపై నీరు వస్తే ప్రజలు రుతుపవనాల వస్తున్నాయని నమ్ముతారని పేర్కొన్నారు. మరోవైపు, జగన్నాథుని ఆలయ గోపురంలో ఏర్పాటు చేసిన రాళ్లు ప్రతి ఏడాది రుతుపవనాల రాకను అంచనా వేస్తాయని బెహతా గ్రామానికి చెందిన 70 ఏళ్ల భగవాన్ దీన్ తెలిపారు. ప్రతి ఏడాది అద్భుతాన్ని చూస్తున్నామని అన్నారు.

130 ఏళ్లనాటి రామాలయం- అయోధ్యతో లింక్- కుటుంబసమేతంగా రామయ్య! - Jaipur Ancient Ram Temple

జాబ్​లో ప్రమోషన్ కావాలా? జగన్మోహిని కేశవుడిని దర్శించుకుంటే చాలు! ఈ గుడి ఎక్కడుందంటే? - Jaganmohini Kesava Swamy Temple

ABOUT THE AUTHOR

...view details