Telangana Tourism Shiridi Flight Package : పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం ఎప్పటికప్పుడూ కొత్తకొత్త ప్యాకేజీలను ప్రవేశపెడుతోంది. బస్సు, రైలు ద్వారా వివిధ టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తుంది. అందుబాటు ధరలోనే ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవాలనుకునే భక్తులకు తాజాగా ఈ సంస్థ ఒక శుభవార్తను చెప్పింది. తక్కువ ధరలోనే హైదరాబాద్ నుంచి షిరిడీకి టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫ్లైట్ జర్నీ ద్వారా సాయినాథుడిని దర్శనం చేసుకోవచ్చు. మరి ఈ ట్రిప్ ఎలా సాగుతుంది ? ఏయే ప్రాంతాలను చూడొచ్చు ? ప్యాకేజీ ధర ఎంత ఉంటుంది ? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ టూరిజం 'షిర్డీ-ఫ్లైట్ ప్యాకేజీ-తెలంగాణ టూరిజం' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రెండు రోజుల పాటు ఈ టూర్ ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ టూర్ ద్వారా షిరిడీ సాయినాథుడి దర్శనంతో పాటు పంచముఖి గణపతి టెంపుల్, ఖండోబా మందిర్ వంటి వివిధ ప్రాంతాలను సందర్శించవచ్చు.
టూర్ ఇలా సాగుతుంది :
- మొదటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి షిరిడీకి ఫ్లైట్ జర్నీ ప్రారంభమవుతుంది.
- మధ్యాహ్నం 2.50 గంటలకు షిరిడీవిమానాశ్రయానికి చేరుకుంటారు.
- తర్వాత అక్కడి నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం సాయిబాబా దర్శనం ఉంటుంది.
- సాయంత్రం 6 నుంచి 6.30 గంటలకు జరిగే హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే సాయినాథుడిని దర్శనం కూడా చేసుకోవచ్చు.
- నైట్ 7 నుంచి 7.30 గంటల మధ్య థీమ్ పార్క్‌లో షో ఉంటుంది. అందులో పాల్గొంటారు.
- తర్వాత రాత్రి 8 గంటల వరకు షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి 9 గంటలకు తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. అక్కడే నైట్ స్టే చేస్తారు.
హైదరాబాద్ టూ అయోధ్య వయా కాశీ - IRCTC సూపర్ ప్యాకేజీ - ధర కూడా తక్కువే! - IRCTC Punya Kshetra Yatra