Telangana Tourism Mysore Tour Package: తెలంగాణ టూరిజం.. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలనుకునేవారికి, విహార యాత్రలకు వెళ్లాలనుకునేవారి కోసం ఎన్నో ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు కూడా తక్కువ ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ప్యాకేజీని టూరిస్టుల కోసం తీసుకొచ్చింది తెలంగాణ టూరిజం. సమ్మర్లో టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ టూరిజం.. బెంగళూరు, మైసూరుతో పాటు ఊటీని చూసేందుకు ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. ఈ ప్యాకేజీ ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ సిటీ నుంచి జర్నీ ఉంటుంది. రోడ్జు మార్గం(బస్సు) ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఆరు రోజులపాటు సాగే ఈ టూర్లో ఎన్నో టూరిస్ట్ ప్లేసులను చూడొచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
తక్కువ ధరలో సాయి దర్శనం - తెలంగాణ టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీ! - telangana tourism packages
హైదరాబాద్ - ఊటీ - మైసూర్ టూర్ ప్రయాణం ఇలా:
- మొదటి రోజు మధ్యాహ్నం 03.30 గంటలకు హైదరాబాద్‌లోని యాత్రి నివాస్ నుంచి బస్సు జర్నీ స్టార్ట్ అవుతుంది.
- తర్వాత బషీర్‌బాగ్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకుని అక్కడి నుంచి బెంగుళూరుకు బయలుదేరుతుంది. నైట్ అంతా జర్నీ ఉంటుంది
- రెండో రోజు ఉదయం 6 గంటలకు బెంగళూరు చేరుకుంటారు. టిఫిన్ తర్వాత లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది.
- అక్కడ బుల్ టెంపుల్, లాల్ బాగ్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, ఇస్కాన్ టెంపుల్, విధాన సౌధ, తిపస్ ప్యాలెస్, కబ్బన్ పార్క్ చూపిస్తారు.
- సాయంత్రం తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. ఆ రాత్రికే అక్కడే బస ఉంటుంది.
- మూడో రోజు బెంగళూరు నుంచి ఉదయం 4 గంటలకే ఊటీకి బయల్దేరుతారు. మధ్యాహ్నం 1 గంటకు ఊటీకి చేరుకుంటారు.
- లంచ్ తర్వాత దొడబెట్టలోని పలు ప్రాంతాలు చూస్తారు. బోటానికల్ గార్డెన్ సందర్శనతో పాటు పాటు బోటింగ్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు హోటల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడ బస ఉంటుంది.