తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jul 30, 2024, 7:52 AM IST

ETV Bharat / bharat

సుప్రీం కోర్టులో లోక్​ అదాలత్​ ప్రారంభం- కక్షిదారులు అలా చేస్తే జడ్జిలకు సంతృప్తి అని CJI వ్యాఖ్య! - Special Lok Adalat

Special Lok Adalat At SC : వివాదాలను కక్షిదారులే స్వచ్ఛందంగా పరిష్కరించుకోవడానికి వీలు కల్పించే ప్రత్యేక లోక్‌ అదాలత్ సుప్రీంకోర్టులో సోమవారం ప్రారంభమైంది. సామరస్యంగా పరిష్కారమయ్యే కేసులుంటే లాయర్లు ప్రత్యేక లోక్అదాలత్ ముందుకు తీసుకురావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్​ కోరారు.

Special Lok Adalat At SC
Special Lok Adalat At SC (ANI)

Special Lok Adalat At SC : వివాదాలకు సంబంధించి తమ కేసులను కక్షిదారులే స్వచ్ఛందంగా పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక లోక్ ​అదాలత్​​ సోమవారం నుంచి ప్రారంభమైంది. సుప్రీం కోర్టు 75వ వార్షికోత్సవ సందర్భంగా దీనిని ప్రారంభించారు. ఈ మధ్యవర్తిత్వ ప్రక్రియలో మొదటగా ఏడు సుప్రీం కోర్టు ధర్మాసనాలు పాల్గొని అపరిష్కృత కేసులను పరిష్కరిస్తాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ తెలిపారు. జులై 29 నుంచి ఆగస్టు 3 వరకు ఈ ధర్మాసనాలు విచారణలు జరపుతాయని అన్నారు. సామరస్యంగా పరిష్కారం కాగల కేసులు ఉంటే వాటిని న్యాయవాదులు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ ముందుకు తీసుకురావాలని ఆయన కోరారు.

'లోక్‌ అదాలత్‌లు మన దేశ న్యాయవ్యవస్థలో అంతర్భాగం. వైవాహిక వివాదాలు, ఆస్తి తగాదాలు, మోటారు ప్రమాదాల క్లెయిములు, భూ సేకరణకు సంబంధించిన వ్యాజ్యాలు, పరిహారం, కార్మిక వివాదాలు సంబంధించిన కేసులు కోర్టులో కొండలా పేరుకుపోయాయి. ఈ లోక్‌ అదాలత్‌లు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగంగా పనిచేస్తూ ఆ కేసులను తగ్గించేందుకు వీలు కల్పిస్తున్నాయి. కక్షిదారులు తమలో తామే సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకోవడానికి తోడ్పడటం న్యాయమూర్తులకు ఎంతో సంతృప్తి కలిగిస్తుందని' అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు.

ఈ లోక్​ అదాలత్​ వ్యవస్థ కంటే ముందు పటియాలా హౌస్​లోని ఒక కుటుంబ న్యాయస్థానంలో ఓ జంటకు సంబంధించిన విడాకుల కేసు గురించి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ప్రస్తావించారు. ఆ కోర్టులో భర్త విడాకుల కోసం అర్జీ పెట్టగా, భార్య మెయింటెనెస్స్​ కోసం, పిల్లల కస్టడీ కోసం పిటిషన్‌ వేశారని ఆయన వివరించారు. తరవాత వారిద్దరూ తమకుతాముగా వివాదాన్ని పరిష్కరించుకున్నామని కోర్టుకు తెలిపారని, ఆపైన ఆనందంగా కాపురం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు.

చరిత్రలో నిలిచిపోయే రోజు
ఇది ఒక చరిత్రాత్మకమైన రోజుగా తాను భావిస్తున్నారని సుప్రీం కోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా, చిన్న కేసులు వేగంగా పరిష్కారం కానున్నాయని తెలిపారు. ఈ ఆలోచన వల్ల ఏళ్ల తరబడి కోర్టుల చుట్టు తిరగలేని నిరుపేదలు, సమస్యలను ఇక్కడ పరిష్కరించుకోవచ్చని అన్నారు.

రిజర్వేషన్ల పెంపుపై నితీశ్ సర్కార్​కు ఎదురుదెబ్బ- హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

'నీట్‌ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు'- సుప్రీంకోర్టు తీర్పు - SC on NEET UG Paper Leak

ABOUT THE AUTHOR

...view details