తప్పిన గోల్... పగిలిన లైట్ పోల్ - Nuneaton Borough beat Stratford Town
🎬 Watch Now: Feature Video

సదరన్ ప్రీమియర్ సెంట్రల్ లీగ్‌లో భాగంగా న్యూనెటన్ బారో, స్టాట్పోర్డ్ టౌన్ జట్ల మధ్య సాకర్ మ్యాచ్ జరిగింది. ఇందులో 60వ నిముషంలో 0-0తో ఇరుజట్ల స్కోర్లు సమమయ్యాయి. బంతి అందుకున్న న్యూనెటన్ జట్టు ఆటగాడు టోనీ బ్రీడెన్.. బంతిని కొట్టగా అది గోల్ పోస్టు పైనుంచి వైళ్లి వీక్షకుల గ్యాలరీలోని లైట్‌ను తాకింది. అయితే ఆ తర్వాత మ్యాచ్‌లో ఆ జట్టులోని ఆటగాళ్లు పోవెల్, జోయల్ కెట్టెల్ రెండు గోల్స్ చేయడం వల్ల 2-0 తేడాతో ప్రత్యర్థి జట్టుపై గెలిచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.