అమ్మకానికి 'జేమ్స్ బాండ్' ప్రత్యేక కారు - థండర్ బాల్ సినిమా
🎬 Watch Now: Feature Video
జేమ్స్ బాండ్ సిరీస్‌లోని 'గోల్డ్ ఫింగర్', 'థండర్ బాల్' సినిమాల్లో ఉపయోగించిన ఆస్టన్ మార్టిన్ డీబీ5 కారును సొంతం చేసుకునేందుకు మీకో అవకాశం. న్యూయర్క్‌లోని సోత్‌బై వేలంపాటలో దీనిని అందుబాటులో ఉంచనున్నారు. ఆగస్టులో జరగనున్న ఈ ఆక్షన్‌లో ఆసక్తి ఉన్న వారు కారును కొనుగోలు చేయవచ్చు. 13 అధునాతన గ్యాడ్జెట్లు, తిరిగే నంబర్ ప్లేట్, మెషిన్ గన్స్‌తో పాటు మరెన్నో సదుపాయలు ఈ కారులో ఉన్నాయి. ఈ కారు నాలుగు నుంచి ఆరు మిలియన్ డాలర్ల ధర పలికే అవకాశం ఉంది.