సినిమా రంగం హృదయాన్ని కోల్పోతోంది: గొల్లపూడి - గొల్లపూడి రచనలు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5351110-thumbnail-3x2-go.jpg)
గొల్లపూడి మారుతీరావు.. సినీ నటుడిగానే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయనో గొప్ప సాహితీవేత్త. కవిగా, రచయితగా, నాటక కర్తగా, జర్నలిస్టుగా, వక్తగా పేరు సంపాదించారు. ఆకాశవాణిలో దాదాపు రెండు దశాబ్దాలపాటు సేవలందించారు. తెలుగు సాహిత్యంపై ఆయన చేసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు పలు విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలయ్యాయి. తెలుగు వినీలాకాశంలో ఎంతో కీర్తి గడించిన మారుతీ రావు అనారోగ్యం కారణంగా ఈరోజు కన్నుమూశారు. అంతకు ముందు జరిగిన ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. సినీ రంగం హృదయాన్ని కోల్పోతుందంటూ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. వాటితో పాటే మరిన్ని విషయాలను పంచుకున్నారు.