జల్లికట్టు బసవన్న మృతికి ఊరంతా సంతాపం - జల్లికట్టు ఎద్దు అప్పా మృతి
🎬 Watch Now: Feature Video
తమిళనాడు మధురైలో జల్లికట్టు ఎద్దుకు శోకతప్త హృదయాలతో నివాళులు అర్పించారు సోలంగూర్ని గ్రామస్థులు. వెయ్యికిపైగా ప్రసిద్ధ జల్లికట్టు క్షేత్రాలలో సత్తా చాటిన 'అప్పా' ఎద్దు అక్టోబర్ 30న మరణించింది. అప్పా అంటూ ముద్దుగా పిలుచుకునే ఎద్దు మూగబోయేసరికి యజమాని దీపక్‌తో సహా చుట్టుపక్కల గ్రామాలవారు విచారంలో మునిగిపోయారు. అప్పాను చివరి సారిగా చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. సంప్రదాయ పద్ధతిలో ఆ వృషభానికి ఘనంగా అంత్యక్రియలు జరిపారు.
Last Updated : Nov 1, 2019, 1:45 PM IST