రాష్ట్రపతి భవన్లో బోల్సొనారోకు ఘన స్వాగతం - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
🎬 Watch Now: Feature Video
భారత్లో పర్యటిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జాయిర్ మెసియస్ బోల్సొనారో.. రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. బోల్సొనారోకు ఘనస్వాగతం పలికారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారమే భారత్ చేరుకున్నారు బ్రెజిల్ అధ్యక్షుడు. కుమార్తె లారా బోల్సొనారో, కోడలు లెటీసియా ఫిర్మీతో పాటు ఎనిమిది మంది మంత్రుల బృందంతో భారత్కు విచ్చేసిన జాయిర్ బోల్సొనారో.. జనవరి 26న నిర్వహించే 71వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
Last Updated : Feb 18, 2020, 8:36 AM IST