మూడో అంతస్తు నుంచి దూకిన రోగి.. ఆ తర్వాత..! - మూడో అంతస్తు నుంచి దూకిన రోగి.. పట్టేసిన సిబ్బంది
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5380268-275-5380268-1576403375298.jpg)
మధ్యప్రదేశ్ బైతుల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో ఓ రోగి హల్చల్ చేశాడు. బడేగావ్ గ్రామానికి చెందిన మదన్ సింగ్ నిగమ్.. నిద్ర మత్తు వ్యాధితో రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. మానసికంగా ఒత్తిడికి గురైన అతడు.. ఆదివారం ఉదయం ఆసుపత్రి మూడో అంతస్తు మూత్రశాలలోని కిటికీ అద్దాలు పగలగొట్టాడు. అనంతరం అక్కడి నుంచి కిందకు దూకేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న సిబ్బంది అతడిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ.. వారి మాట వినకుండా కిందకు దూకేశాడు మదన్. కానీ టార్ఫలీన్ పరదల సాయంతో మదన్‌ను రక్షించారు. పైనుంచి పడిపోవటం వల్ల స్వల్ప గాయాలయ్యాయి. అతడికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.