మూడో అంతస్తు నుంచి పడ్డ బాలుడు.. పట్టేసిన యువకులు

By

Published : Dec 3, 2019, 10:20 PM IST

thumbnail
గుజరాత్​లోని దమన్ దీవ్​లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. భవనం మూడో అంతస్తు నుంచి కిందపడుతున్న బాలుడిని స్థానికులు సురక్షితంగా కాపాడారు. బాలుడు కిందపడటం గమనించిన స్థానిక యువకుడు... రక్షించడానికి అక్కడే నిల్చున్నాడు. కిందపడబోయే సమయంలో సురక్షితంగా పట్టుకున్నాడు. బాలుడికి ఎటువంటి గాయాలు కాలేదు. నిన్న జరిగిన ఈ ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. బాలుడిని కాపాడిన స్థానికులపై సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.