కుస్తీ పోటీల్లో కుర్రాళ్లను మట్టికరిపిస్తోన్న 'దంగల్' బాలిక - nagpur 14yrs old dangal girl wrestling with boys
🎬 Watch Now: Feature Video

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మహిళలు.. క్రీడల్లో విశేషంగా రాణిస్తున్నారు. పురుషులతో ఏమాత్రం తీసిపోకుండా రికార్డులు కొల్లగొడుతున్నారు. మహారాష్ట్ర నాగ్‌పుర్‌లోని తివుసా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక.. కుర్రాళ్లనే కుస్తీలో ఓడించి అబ్బురపరుస్తోంది. ఏటా నిర్వహించే కుస్తీ పోటీల్లో బాలురతో తలపడుతోంది అపూర్వ దేవ్‌గఢ్. శివాజీ వ్యాయామశాల ఏటా నిర్వహించే కుస్తీ పోటీల్లో గత రెండేళ్లుగా కుర్రాళ్లను మట్టికరిపిస్తూ ఛాంపియన్‌గా నిలుస్తోంది.
TAGGED:
dangal with boys