ఆ అధికారిపై విద్యార్థి దాడి చేశాడు ఎందుకు..? - ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ
🎬 Watch Now: Feature Video

పాఠశాలకు చెందిన అధికారిపై జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారన్న కారణంతో శిశు సంక్షేమ శాఖ అధికారిణిపై ఓ విద్యార్ధి దాడి చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగింది. తప్పు చేసిన పాఠశాల అధికారి గురించి ఆమె విద్యార్ధులను అడిగి తెలుసుకుంటుండగా ఓ విద్యార్ధి ఆమెపై దాడికి దిగాడు. ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నిస్తూ మొదట ఆమె సంచిని దూరంగా విసిరేశాడు. అనంతరం ఆమెను కొడుతూ కుర్చీతో కూడా దాడికి దిగాడు. సీసీ కెమెరాల్లో ఈ దాడి దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.