5 లక్షల దీపకాంతులతో అయోధ్య గిన్నీస్ రికార్డు - యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ అయోధ్య
🎬 Watch Now: Feature Video
ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలో దీపోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. 5 లక్షల 51 వేల దీపాలు వెలిగించి ధూంధాంగా దీపావళి సంబరాలు చేసుకున్నారు అయోధ్య వాసులు. లక్షలాది దీపకాంతుల్లో ఆ నగరమంతా తేజోవంతంగా వెలుగుతోంది. గతేడాది ఇదే విధంగా 3 లక్షల దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డుగా నమోదు చేసింది అయోధ్య. ఈ సారి 45 నిమిషాల్లో 5 లక్షల దీపాలు వెలిగించి ఆ రికార్డును బద్దలుగొట్టి గిన్నీస్లో చోటు సంపాదించుకుంది. ఇందుకోసం సుమారు 40 వేల లీటర్ల నూనె వినియోగించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇందులో పాల్గొన్న ప్రజలకు అభినందనలతో పాటు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు
Last Updated : Oct 26, 2019, 8:46 PM IST