ETV Bharat / sukhibhava

గుండె భాష వినండి- ప్రమాదాన్ని ముందే పసిగట్టండి

భాష ఏదైతేనేం భావం ప్రధానం. గుండె భాష అలాంటిదే. జబ్బుల గురించి ముందే గొంతెత్తుతుంది. ఛాతీ నొప్పి రూపంలోనే కాదు, రకరకాలుగా తన ఘోషను వెలిబుచ్చుతుంది. ముఖ్యంగా.. ఇతరత్రా వ్యాధులుగా బురిడీ కొట్టించే లక్షణాలపై ఏమాత్రం ఏమరుపాటు తగదని ముందే హెచ్చరిస్తుంది. వరల్డ్‌ హార్ట్‌ డే సందర్భంగా ఓసారి గుండె మాట విందాం.

HEART DAY
గుండె భాష వింటున్నారా?
author img

By

Published : Sep 29, 2020, 8:56 AM IST

గుండెజబ్బు అనగానే ఛాతీలో నొప్పి, చెమట్లు పట్టటం, ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి కావటం వంటివే ముందుగా గుర్తుకొస్తాయి. అందరిలోనూ ఇలాంటి స్పష్టమైన, కచ్చితమైన లక్షణాలే ఉండాల్సిన అవసరం లేదు. కొందరిలో ఇతరత్రా లక్షణాలూ పొడసూపొచ్ఛు చాలాసార్లు ఇవి మామూలువనే అనిపించొచ్ఛు పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, అసలివి సమస్యలే కావనీ అనిపించొచ్ఛు నిస్సత్తువ, దవడ నొప్పి, భుజం నొప్పి, ఆయాసం, కాళ్ల వాపులు, గుండెదడ వంటివి అలాంటి సంకేతాలే. నిజానికి చాలావరకివి ఇతర జబ్బుల ఆనవాళ్లే అయ్యిండొచ్ఛు అంతమాత్రాన గుండెతో సంబంధం లేవివని పూర్తిగా కొట్టిపారెయ్యటానికీ లేదు. తరచి చూస్తే గానీ అసలు విషయం బయట పడదు. కొన్నిసార్లు ఇవి రోజులు, నెలల ముందు నుంచే కనిపిస్తుండొచ్ఛు ఛాతీలోనొప్పి వంటి స్పష్టమైన లక్షణాలతో పోలిస్తే ఇతరత్రా లక్షణాలు కనిపించేవారే ఎక్కువ. వీటిని కాస్త లోతుగానే పరిశీలించాల్సి ఉంటుంది. మామూలు సమస్యలైతే ఇబ్బందేమీ లేదు గానీ గుండె జబ్బుతో ముడిపడినవైతే ముందే జాగ్రత్త పడొచ్ఛు సమస్య ముదరకుండా, ప్రాణాంతకంగా పరిణమించకుండా కాపాడుకోవచ్ఛు

ఆయాసం

HEART DAY
గుండె భాష వింటున్నారా?

వేగంగా, బలమైన పనులు చేసినప్పుడు ఆయాసం రావటం మామూలే. ఇదేమీ పెద్ద ఇబ్బందికరమైంది కాదు. అంతమాత్రాన తేలికగా తీసుకోవటానికీ లేదు. అధిక బరువు, ఊబకాయం, రక్తహీనత వంటి సమస్యల్లోనే కాదు.. గుండె జబ్బులోనూ ఆయాసం రావొచ్ఛు చాలామంది దీన్ని మామూలు ఇబ్బందిగానే పొరపడుతుంటారు. కొందరైతే ఆయాసం వస్తుందని పనులను నెమ్మదిగానూ చేస్తుంటారు. ఉదాహరణకు గబగబా మెట్లు ఎక్కేవాళ్లు ఇప్పుడు నెమ్మదిగా ఎక్కుతుండొచ్ఛు దీన్ని విస్మరించటానికి వీల్లేదు. ముఖ్యంగా.. రోజూ సునాయాసంగా చేసే పనుల్లోనూ కొత్తగా ఆయాసం వస్తున్నట్టయితే తప్పకుండా ఆలోచించాల్సిందే. మన శ్వాస, గుండె పంపింగ్‌ సామర్థ్యం ఒకదాంతో మరోటి ముడిపడి ఉంటాయి. గుండె సరిగా రక్తాన్ని పంప్‌ చేయలేకపోతే కండరాలకు తగినంత ఆక్సిజన్‌ అందక ఆయాసానికి దారితీస్తుంది. రక్తనాళాల్లో పూడికల మూలంగా గుండెకు తగినంత రక్తం సరఫరా కాకపోయినా ఇబ్బందే. దీంతో గుండె మరింత ఎక్కువగా కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. ఫలితంగా గుండె కండరం మందంగా, గట్టిగా తయారవుతుంది. పంపింగ్‌ సామర్థ్యమూ తగ్గుతుంది. గుండె బలంగా పనిచేస్తుంటేనే ఊపిరితిత్తుల్లోని రక్తం పూర్తిగా గుండెకు చేరుకుంటుంది. లేకపోతే కొంత రక్తం ఊపిరితిత్తుల్లోనే ఉండిపోతుంది. దీంతో క్రమంగా ఊపిరితిత్తుల్లో ద్రవాలు పోగుపడి ఆయాసం తలెత్తుతుంది. గుండె కవాట సమస్యలూ దీనికి దారితీయొచ్ఛు

గుండె దడ

HEART DAY
గుండె భాష వింటున్నారా?

కాస్త ఎక్కువదూరం నడిచినప్పుడో, కష్టమైన పనులు చేసినప్పుడో గుండె కాస్త వేగంగా కొట్టుకోవటం సహజమే. ప్రత్యేకమైన కారణాలేవీ లేకుండా గుండెదడగా అనిపిస్తుంటే నిర్లక్ష్యం పనికిరాదు. తేలికైన పనులు చేస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడూ ఇలాంటిది గుర్తిస్తే తాత్సారం చేయరాదు. ఇందుకు రకరకాల అంశాలు దోహదం చేస్తుంటాయి. కవాట సమస్యలు గలవారిలో రక్తం లీకేజీ అవటం వల్ల గుండె మీద భారం పెరుగుతుంది. దీంతో గుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది. గుండెలో విద్యుత్‌ స్పందనల తీరుతెన్నులు అస్తవ్యస్తమైనా గుండెదడకు దారితీస్తుంది. సాధారణంగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గుండె 60-100 సార్లు కొట్టుకుంటుంది. వేగంగా పరుగెత్తినప్పుడు, బాగా కష్టమైన పనులు చేసినప్పుడు ఇది 160-180 వరకు చేరుకుంటుంది. గుండె విద్యుత్‌ స్పందనలు అస్తవ్యస్తమైనవారిలో, కవాట సమస్యలు గలవారిలో తేలికైన పనులు చేస్తున్నప్పుడు, విశ్రాంతి తీసుకునేటప్పుడూ గుండె వేగంగా కొట్టుకుంటుంది.

నిస్సత్తువ

తరచూ విస్మరించే గుండెజబ్బు లక్షణమిది. నిజానికి దీనికి కారణాలు అనేకం. అందుకే దీన్ని గుండె జబ్బు లక్షణమనే అనుకోరు. రోజు కన్నా ఎక్కువ పనిచేశామనో, కష్టపడ్డామనో.. అందుకే నిస్సత్తువగా ఉందనో భావిస్తుంటారు. ఎక్కువ పనిచేసినప్పుడు నీరసంగా అనిపించటం మామూలే గానీ అంతకుముందు లేకుండా కొత్తగా నిస్సత్తువగా అనిపిస్తున్నా, విడవకుండా వేధిస్తున్నా నిర్లక్ష్యం తగదు. ఇది గుండె వైఫల్యం, గుండె రక్తనాళాల్లో పూడికలకు సంకేతం కావొచ్ఛు గుండె వైఫల్యంలో పంపింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది. దీంతో కండరాలకు తగినంత రక్తం అందదు. ఫలితంగా ఆక్సిజన్‌, పోషకాల సరఫరా తగ్గుతుంది. గుండెకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో పూడికలు తలెత్తినా గుండె కండరానికి తగినంత రక్తం సరఫరా కాదు. దీంతోనూ గుండె పనితీరు మందగిస్తుంది. ఇలా శరీరంలోని ఇతర భాగాలకు గానీ గుండె కండరానికి గానీ ఆక్సిజన్‌తో కూడిన రక్తం తగినంతగా అందకపోవటం నిస్సత్తువకు దారితీస్తుంది.

అసాధారణ నొప్పులు

గుండెపోటుకు ప్రధాన కారణం గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటం. పూడికల మూలంగా గుండె కండరానికి తగినంత రక్తం అందదు. దీంతో మరింత ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనికి తట్టుకోలేక గుండె ‘నొప్పి’తో విలవిల్లాడిపోతుంది. ఇది అన్నిసార్లూ ఛాతీలోంచే పుట్టుకు రావాలనేమీ లేదు. కొన్నిసార్లు కింది దవడ నొప్పిగానూ బయటపడొచ్ఛు చాలామంది దీన్ని పంటి సమస్యగానూ పొరపడుతుంటారు. కొందరికి గొంతు నొప్పి, మెడ నొప్పి మాదిరిగానూ అనిపించొచ్ఛు కొన్నిసార్లు భుజాల్లో నొప్పి రూపంలోనూ బయటపడొచ్ఛు చేతులు లాగుతూ ఉండొచ్ఛు పొట్ట పైభాగాన నొప్పి, అసౌకర్యం, అజీర్ణంగానూ పొడసూపొచ్ఛు దీన్ని కొందరు అసిడిటీగానూ పొరపడుతుంటారు. మగవారిలో కన్నా ఆడవాళ్లలో ఇలాంటి లక్షణాలు ఎక్కువ. ఛాతీలో ఎలాంటి ఇబ్బంది లేకపోవటం వల్ల వీటిని పెద్దగా పట్టించుకోరు. మామూలు సమస్యలుగానే పొరపడుతుంటారు. గుండెకు సంబంధించిన నాడులు.. కింది దవడ, మెడ, భుజాలు, చేతులు, పొట్టలో బొడ్డు వరకు వెళ్లే నాడులు వెన్నుపాములో ఒకే దగ్గర్నుంచి మొదలవుతాయి. ఇవి పక్కపక్కనే, కలగలసిపోయి ఉంటాయి. గుండె నొప్పి కొన్నిసార్లు దవడ, భుజాలు, మెడ, చేయి నొప్పులుగానూ బయటపడటానికి కారణం ఇదే. సాధారణంగా ఇవి శారీరకశ్రమతో ఎక్కువవుతుంటాయి. కాబట్టి ఏదైనా పనిచేసినప్పుడు, వ్యాయామం చేసినప్పుడు ఇలాంటి నొప్పులు మొదలవటం.. పనులను ఆపేస్తే నొప్పి తగ్గుతున్నట్టు గుర్తిస్తే తాత్సారం చేయరాదు. ఇతర సమస్యలతో తలెత్తే నొప్పులు శారీరక శ్రమతో, పనులతో ఎక్కువకావని తెలుసుకోవాలి.

కాళ్లవాపులు

ఎప్పుడైనా ఎక్కువసేపు నిలబడితే కొద్దిగా కాళ్లు వాయటం సహజమే. కానీ తరచూ కాళ్ల వాపులు వేధిస్తుంటే అనుమానించాల్సిందే. ప్రత్యేకించి- కొత్తగా కాళ్లవాపులు వస్తుంటే విస్మరించకూడదు. శరీరంలోని అవయవాలు పోషకాలను, ఆక్సిజన్‌ను వినియోగించుకున్నాక సిరల ద్వారా రక్తం తిరిగి గుండెకు చేరుకుంటుంది. గుండె సామర్థ్యం తగ్గితే ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. ఒకవైపు గుండెలోంచి పూర్తిస్థాయిలో రక్తం బయటకు రాదు. మరోవైపు అవయవాల నుంచి రక్తం సరిగా గుండెకు చేరుకోదు. కాలి సిరల నుంచి గుండెకు రక్తం చేరుకోవటం దెబ్బతింటే వాపులు మొదలవుతాయి. గుండె సామర్థ్యం తగ్గినవారిలో ముఖ్యంగా.. గుండె కుడి భాగం పనితీరు తగ్గినవారిలో ఇవి కనిపిస్తుంటాయి. కాలేయం, కిడ్నీ సమస్యలు, కాలి సిరల్లో అడ్డంకుల వంటి సమస్యల్లోనూ కాళ్ల వాపులు తలెత్తుంటాయి. దీంతో వీటిని చాలామంది ఇతర సమస్యల లక్షణాలుగానే పొరపడుతుంటారు.

ముందే పట్టుకుంటే చికిత్స తేలిక

గుండె జబ్బు లక్షణాలను ముందే పసిగడితే చికిత్స తేలికవుతుంది. రక్తనాళాల్లో, కవాటంలో, గుండె కండరంలో, గుండె చుట్టూ ఉండే పొరలో, గుండె విద్యుత్‌ వ్యవస్థలో ఎక్కడైనా సమస్య ఉండొచ్ఛు ఆయా సమస్యలను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. సమస్యలు ఒక మాదిరిగా, మధ్యస్థంగా ఉంటే మందులతోనే చికిత్స చేయొచ్ఛు పూడికలు గలవారికి రక్తాన్ని పలుచగా చేసే ఆస్ప్రిన్‌ లేదా క్లొపిడెగ్రిల్‌ మందులు.. పూడిక మరింత పెరగకుండా కొలెస్ట్రాల్‌ను తగ్గించే స్టాటిన్స్‌ ఉపయోగపడతాయి. కవాట సమస్యలుంటే గుండె మీద ఒత్తిడి తగ్గటానికి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు లేదా ఏసీఈ ఇన్‌హిబాటర్‌ రకం మందులతో మంచి ఫలితం కనిపిస్తుంది. గుండె బాగా బలహీనపడినవారికి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు, ఏసీఈ ఇన్‌హిబిటార్‌ రకం మందులు, బీటా బ్లాకర్లు మేలు చేస్తాయి. మందులతో ఫలితం కనిపించకపోతేనే శస్త్రచికిత్సల వంటి పద్ధతులు ప్రయత్నిస్తారు. కవాటం సరిగా తెరచుకోనివారికి గొట్టం ద్వారా బెలూన్‌ను పంపించి సరిచేయాల్సి ఉంటుంది. బెలూన్‌ ప్రక్రియ సాధ్యపడకపోతే ఆపరేషన్‌ చేసి, కవాటాన్ని మార్చాల్సి ఉంటుంది. కవాటం సరిగా మూసుకుపోకుండా రక్తం బాగా లీకవుతుంటే సర్జరీతో కవాట మార్పిడి చేస్తారు. కొందరికి పేస్‌మేకర్లు అవసరపడొచ్ఛు గుండె చుట్టూ ఉండే పొర గట్టిపడినవారికి సర్జరీ చేసి పొరను తీసేయాల్సి ఉంటుంది. విద్యుత్‌ వ్యవస్థలో సమస్య గలవారికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్‌ పద్ధతి ద్వారా సరిచేస్తారు.

అనుమానించటమెలా?

నిస్సత్తువ, ఇతరత్రా నొప్పులు, ఆయాసం, కాళ్లవాపులు, గుండె దడ వంటివి చాలారకాల సమస్యల్లో కనిపిస్తుంటాయి. మరి వీటిని గుండెజబ్బు లక్షణాలుగా ఎప్పుడు అనుమానించాలి?

  • వ్యాయామంతో, శారీరక శ్రమతో లక్షణాలు తీవ్రం అవుతూ.. విశ్రాంతి తీసుకున్నప్పుడు తగ్గుతున్నప్పుడు.
  • ఒకటి కన్నా ఎక్కువ లక్షణాలు ఒకేసారి కనిపిస్తున్నప్పుడు (ఉదాహరణకు- ఆయాసంతో పాటు కాళ్లవాపులూ ఉండటం).
  • మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్‌, ఊబకాయం, పొగ తాగే అలవాటు వంటి గుండెజబ్బు ముప్పు కారకాలు గలవారిలో ఇలాంటివి కనిపించినప్పుడు.
  • ఇలాంటి సమయాల్లో ఒకసారి గుండెజబ్బు ఉందేమో పరీక్ష చేయించుకొని, నిర్ధారించుకోవటం మంచిది. చాలాసార్లు ఇతరత్రా జబ్బులకు సంబంధించినవే కావొచ్చు గానీ అసలు సమస్యేంటో తెలుసుకుంటే నిశ్చింతగా ఉండొచ్చు.

ఇదీ చదవండి: కరోనా నిర్ధారణకు చౌకైన, వేగవంతమైన పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.