తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పనులు తుదిదశకు చేరుకున్నాయి. భక్తులు కొంగుబంగారంగా కొలిచే పంచనారసింహుల దివ్యక్షేత్రంలోని అష్టభుజ మండప ప్రాకారంలో లోపలివైపు యాలీ స్థూపాలు, సింహ రూపాలు కనువిందు చేస్తున్నాయి. ఆలయం చుట్టూ నిర్మితమైన పద్మం ఆకారంలో ఉన్న స్థూపాలు స్వామివారి వైభవాన్ని చాటుతున్నాయి.
వివిధ శిల్ప రూపాలమయంగా రూపుదిద్దుకుంటున్న స్తంభోద్భవుడి సన్నిధి భక్తులను అలరించడానికి సన్నద్ధమవుతోంది. పంచనారసింహ స్వామిని దర్శించుకుని పారవశ్యంలో మునిగిపోయేందుకు వచ్చే భక్తులకు ఆహ్లాదం, ప్రశాంతతం కలిగించేలా యాదాద్రీశుడి కోవెల రూపుదిద్దుకుంటోంది.