ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో బాలాలయ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితుల మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా లక్ష పుష్పార్చన పూజలను నిర్వహించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాహనాలకు పూజలు నిర్వహించారు. ఏకాదశి విశిష్టతను అర్చకులు భక్తులకు తెలియజేశారు.
ఇదీ చదవండిః మెస్మరైజ్ చేసిన మిస్ ఫెమినా సుందరి