భక్తజనులకు ఎంతో ప్రీతికరమైన పులిహోర, లడ్డూ ప్రసాదాల తయారీ కోసం భారీ యంత్రాలు యాదాద్రికి చేరాయి. తిరుమల తరహాలో ఒకేసారి పెద్ద సంఖ్యలో లడ్డూలు తయారు చేసే యంత్రాలను యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నిర్వాహకులు తీసుకొచ్చారు. ఈ యంత్రాల విలువ సుమారు ఎనిమిది కోట్ల రూపాయలని ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సూచనలతో ముంబయి, కోయంబత్తూర్ నుంచి వాటిని తెప్పించినట్లు సమాచారం. కొత్తగా నిర్మించిన భవన సముదాయంలో వీటిని బిగించనున్నారు. భక్తులకు ఎక్కువ మొత్తంలో లడ్డూలు విక్రయించాలనే ఈ యంత్రాలను కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. మరోవైపు దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆకర్షణీయంగా క్యూ కాంప్లెక్స్ ఏర్పాటుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
ఇవీ చూడండి: 'ఆర్టీసీ ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతున్నారు'