యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామిని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కార్తీకమాసం కాగా గొంగిడి సునీత దంపతులు కార్తీక దీపాన్ని వెలిగించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.
ఇదీ చూడండి: దిగొస్తున్న పసిడి ధర.. నేడు ఎంత తగ్గిందంటే?