నల్లమలలో యురేనియం తవ్వకాల ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని యురేనియం వ్యతిరేక పోరాట వేదిక డిమాండ్ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు వంత పాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని వేదిక కన్వీనర్ బట్టి రామచంద్రయ్య ఆరోపించారు. విద్యుత్ ఉత్పత్తికి సోలార్, పవన విద్యుత్ వంటి ప్రత్యామ్నాయాలు ఉండగా.. యురేనియం వైపు మొగ్గుచూపడం మంచిది కాదని హితవుపలికారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసేందుకు వామపక్షాలు, ప్రజాసంఘాలు, కళాకారులు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ మండలిలో తీర్మానం