ETV Bharat / state

మత్తు సూదిచ్చారు... ఆపరేషన్ ఆపేశారు - DOCTORS NEGLIGENCE IN YADADRI

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లారు 200 మంది మహిళలు. అందులో దాదాపు 150 మందికి మత్తు మందిచ్చి పడుకోబెట్టారు. చివరకు ఆపరేషన్ చేయబోమంటూ చేతులెత్తేశారు.

operarions
మత్తు సూదిచ్చారు... ఆపరేషన్ ఆపేశారు
author img

By

Published : Dec 31, 2019, 9:44 AM IST

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకని 200 మంది మహిళలు యాదాద్రి భువనగిరిలో జిల్లాలోని ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. అందులో 150 మందికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. మధ్యాహ్నం వరకు కేవలం 65 మందికి మాత్రమే వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. మిగిలిన వారికి ఆపరేషన్ చేయబోమంటూ చేతులెత్తేశారు.

ఈ క్యాంపులో కేవలం 80 మందికే ఆపరేషన్ చేస్తామని చెప్పి మిగిలిన వారిని వదిలేశారు. మరోరోజు వస్తే... ఆపరేషన్ చేస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానాలిచ్చారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళల కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందితో గొడవకు దిగారు. మరోవైపు ఆశా కార్యకర్తలు కుని చికిత్స కోసం వారిని తీసుకొచ్చారు. ఇంతమందిని గ్రామాల నుంచి భరోసా ఇచ్చి తీసుకువస్తే వైద్యులు ఆపరేషన్ చేయకుండా వెనక్కి పంపడం బాధించిందని తెబుతున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారులను సంప్రదించడానికి ఈటీవీ-ఈటీవీ భారత్ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

మత్తు సూదిచ్చారు... ఆపరేషన్ ఆపేశారు

ఇవీ చూడండి: వనపర్తి సరళాసాగర్ జలాశయానికి గండి

Intro:TG_NLG_51_30_KUNICHIKISTHA_AB_TS10061

యాంకర్ :
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చిన మహిళలకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయకుండా మరోరోజు రావాలంటూ డాక్టర్లు చేతులెత్తేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం జిల్లాలోని వివిధ మండలాల నుంచి 200 మంది మహిళలు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి వచ్చారు. అందులో 150 మందికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, మధ్యాహ్నం వరకు కేవలం అరవై ఐదు మందికి మాత్రమే డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు. వైద్యులు ఈ క్యాంపులో 80 మందికే ఓపరేషన్ నిర్వహిస్తామని మిగిలినవారికి ఆపరేషన్ నిర్వహించలేదు. వారిని మరోరోజు రావాలంటూ తాపీగా సెలవిచ్చారు. దీనితోకుటుంబ నియంత్రణ కోసం వచ్చిన మహిళల కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందితో గొడవకు దిగారు. మరోవైపు ఆశా కార్యకర్తలు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స కోసం వారిని తీసుకువచ్చారు. ఇంతమందిని గ్రామాలనుంచి మా భరోసాతో తీసుకువస్తే డాక్టర్లు ఆపరేషన్ చేయకుండా వెనక్కి పంపడం బాధించిందని వారంటున్నారు.

Body:కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సకు గ్రామాల నుంచి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకు రావడం కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా చేస్తే ఆశా కార్యకర్తల పై నమ్మకం పోతుందని వైద్యుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై జిల్లా వైద్య అధికారులను సంప్రదించడానికి ఈటీవీ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.