యాదాద్రి ప్రధాన ఆలయ విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. దైవదర్శన వరుసల సముదాయ ఏర్పాటుకు యాడా సన్నద్ధమవుతోంది. ఆలయ శిల్పి ఆనందసాయి పర్యవేక్షణలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ నిపుణులతో ఆకర్షణీయంగా వీటిని తీర్చిదిద్దుతున్నారు.
దర్శనాల కోసం సముదాయం నుంచి ఆలయానికి వెళ్లే మార్గంలో మొబైల్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. అల్యూమినియం, ఇత్తడితో హైందవ సంప్రదాయం ఉట్టిపడేలా పనులు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈశాన్య దశ నుంచి తూర్పు రాజగోపురం వరకు వీటిని బిగించనున్నామని శిల్పి ఆనందసాయి తెలిపారు. బ్రహ్మోత్సవ రథ వేడుకల సమయంలో పక్కకు జరపడానికి వీలుగా వీటిని అమర్చనున్నామని వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఎర్రబెల్లి కాన్వాయి వాహనం బోల్తా.. ఇద్దరు దుర్మరణం