ETV Bharat / state

యాదాద్రిలో కేసీఆర్​... ఆలయ పనుల పురోగతిపై ఆరా... - యాదాద్రీశుని సన్నిధిలో సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్​... యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాలను పరిశీలించారు. క్షేత్రంలోని బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులను దర్శనం చేసుకుని... శ్రీ లక్ష్మీనారసింహులకు సువర్ణ పుష్పార్చన జరిపారు. పండితులు, పూజారులు వేదాశీర్వచనం చేసిన అనంతరం... గర్భాలయ నిర్మాణాలు పరిశీలించారు.

cm-kcr-tour-in-yadadri
యాదాద్రిలో కేసీఆర్​... ఆలయ పనుల పురోగతిపై ఆరా...
author img

By

Published : Dec 17, 2019, 4:17 PM IST

Updated : Dec 17, 2019, 5:58 PM IST

యాదాద్రిలో కేసీఆర్​... ఆలయ పనుల పురోగతిపై ఆరా...

యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్​ పరిశీలించారు. బాలాలయంలో దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించి... తూర్పు రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఉదయం 11 గంటల 10 నిమిషాలకు గుట్టకు చేరుకున్న సీఎం... బాలాలయంలో ప్రతిష్ఠామూర్తల దర్శనం చేసుకుని... శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి సువర్ణ పుష్పార్చన చేశారు.

ప్రాంగణ పనులపై ఆరా...

పండితులు, పూజారుల వేదాశీర్వచనం చేసిన తర్వాత పునర్నిర్మాణ పనుల వద్దకు చేరుకున్నారు. తూర్పు రాజగోపురం సమీపంలో కాసేపు తిరిగి ప్రాంగణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. తూర్పు రాజగోపురం ఎదురుగా గల బ్రహ్మోత్సవ మండపంతోపాటు... శివాలయ కట్టడాల్ని చూశారు. శిల్పి ఆనంద్​ సాయి, వైటీడీఏ ఉపాధ్యక్షుడు కిషన్​రావు పనుల తీరును ముఖ్యమంత్రికి వివరించారు.

శిల్పాల పరిశీలన

అనంతరం గర్భాలయ ప్రాకారాలను తిలకించారు. ప్రాంగణంలో కలియ తిరుగుతూ అష్టభుజ మండప ప్రాకారాలను... ప్రవేశ మార్గం ఇరువైపులా తాను సూచించిన ఆధ్యాత్మిక శిల్ప రూపాలను పరిశీలించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి మందిరంతోపాటు ముఖ మండపంలోని ఉప ఆలయాలను చూశారు.

పండితులతో ముచ్చట

ధ్వజస్తంభం, బలిపీఠం పనుల తీరుపై... మార్పులు చేర్పుల గురించి స్తపతులతో మాట్లాడారు. ఆలయ ప్రధానార్చకులు నలంధిగల్ నరసింహాచార్యులతోపాటు ఇతర పండితులతో ముచ్చటించారు. పడమటి దిశలో రూపొందించాల్సిన వాటిపై... స్తపతులు, శిల్పితోపాటు యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు.

ఆలయ పూజారులతో చర్చ

మహారాజగోపురం చెంత ఏర్పాటైన జయవిజయుల స్వాగత దృశ్యాలను చూశాక... ఆలయ పూజారులతో చర్చించారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. గర్భాలయ ప్రాకార మండపాలను చూసిన తర్వాత కేసీఆర్... శివాలయం నిర్మాణాన్ని పరిశీలించారు.

TG_NLG_05_17_CM__On_Temple_PKG_TS10134_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan Contributer: Chandrashekhar(Aleru) ----------------------------------------------------------------- ( ) ముఖ్యమంత్రి కేసీఆర్... యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాలను పరిశీలించారు. క్షేత్రంలోని బాలాలయంలో ప్రతిష్ఠామూర్తుల దర్శనం చేసుకుని... శ్రీ లక్ష్మీ నారసింహులకు సువర్ణ పుష్పార్చణ జరిపారు. పండితులు, పూజారులు వేదాశీర్వచనం చేసిన అనంతరం... గర్భాలయ నిర్మాణాలను సాంతం పరిశీలన చేశారు. ........................LOOK Vo ( ) యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను... సీఎం కేసీఆర్ పరిశీలించారు. బాలాలయంలో దర్శనం, ప్రత్యేక పూజలు నిర్వహించి... తూర్పు రాజగోపురం వద్దకు చేరుకున్నారు. ఉదయం 11 గంటల 10 నిమిషాలకు గుట్టకు చేరుకున్న సీఎం... బాలాలయంలో ప్రతిష్ఠామూర్తుల దర్శనం చేసుకుని... శ్రీ లక్ష్మీ నారసింహులకు సువర్ణ పుష్పార్చణ జరిపారు. పండితులు, పూజారులు వేదాశీర్వచనం చేసిన తర్వాత... పునర్నిర్మాణ పనుల వద్దకు చేరుకున్నారు. తూర్పు రాజగోపురం సమీపంలో కాసేపు తిరిగి... ప్రాంగణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. తూర్పు రాజగోపురం ఎదురుగా గల బ్రహ్మోత్సవ మండపంతోపాటు... శివాలయ కట్టడాల్ని చూశారు. శిల్పి ఆనంద్ సాయి, వైటీడీఏ ఉపాధ్యక్షుడు కిషన్ రావు... పనుల తీరును ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం గర్భాలయ ప్రాకారాలను తిలకించారు. ప్రాంగణంలో కలియతిరుగుతూ అష్టభుజ మండప ప్రాకారాలను... ప్రవేశ మార్గం ఇరువైపులా తాను సూచించిన ఆధ్యాత్మిక శిల్ప రూపాలను పరిశీలించారు. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామి మందిరం, ముఖ మండపంలోని ఉప ఆలయాలను చూశారు. ధ్వజస్తంభం, బలిపీఠం పనుల తీరుపై... మార్పులు చేర్పుల గురించి స్తపతులతో మాట్లాడారు. ఆలయ ప్రధానార్చకులు నలంధిగల్ నరసింహాచార్యులతోపాటు ఇతర పండితులతో ముచ్చటించారు. పడమటి దిశలో రూపొందించాల్సిన వాటిపై... స్తపతులు, శిల్పితోపాటు యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాధికార సంస్థ అయిన యాడా నిర్వాహకులకు దిశానిర్దేశం చేశారు. మహారాజగోపురం చెంత ఏర్పాటైన జయవిజయుల స్వాగత దృశ్యాలను చూశాక... ఆలయ పూజారులతో చర్చించారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ................SPOT Vo గర్భాలయ ప్రాకార మండపాలను చూసిన తర్వాత కేసీఆర్... శివాలయం నిర్మాణాన్ని పరిశీలించారు.
Last Updated : Dec 17, 2019, 5:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.