ETV Bharat / state

రాజులేలిన రాచకొండలో దాగున్న జలపాతాలు - BEAUTIFUL WATER FALLS

ఒకప్పుడు రాజులేలిన రాచకొండ... నేడు పచ్చదనంతో, జలపాతాలతో పర్యటకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతమంతా పచ్చగా మారి సెలయేళ్ల నీటి సవ్వడితో ప్రకృతి ప్రేమికులను మైమరిపిస్తోంది. 50 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న రాచకొండ జలపాతం అందాలు చూసేందుకు పర్యటకులు భారీగా తరలివస్తున్నారు.

రాజులేలిన రాచకొండలో దాగున్న జలపాతాలు
author img

By

Published : Nov 2, 2019, 10:53 AM IST

రాజులేలిన రాచకొండలో దాగున్న జలపాతాలు

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతంలో 10 గుట్టలున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రాచకొండ ప్రాంతంలోని గుట్టల్లో జాలువారుతున్న నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. పల్లగట్టు తండా, కొండమూల తండాల్లో కొండలపై నుంచి 50 అడుగుల ఎత్తులో నుంచి కిందకు జారుతున్న గంగమ్మ గలగలలు బోగత, కుంటాల జలపాతాలను తలపిస్తున్నాయి. నీటి సవ్వడులు వీణులవిందు చేస్తున్నాయి.

ఈ జలపాతాల అందాలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. తెల్లని పాలలాంటి నీటిలో కేరింతలు కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు. సెల్ఫీలు దిగుతూ... ఆ ప్రకృతి అందాలను బంధిస్తున్నారు. కొందరు అక్కడే వంటలు చేసుకొని ప్రకృతి తల్లి ఒడిలో సేద తీరుతున్నారు. జలపాతం అందాలను చూస్తుంటే... సమయమే తెలియట్లేదని చెబుతున్నారు పర్యటకులు.

ఈ రాచకొండ ప్రాంతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్​కు 40 కిలోమీటర్ల దూరంలో, నారాయణపురం మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాచకొండ ప్రాంతంలో రెండు జలపాతాలున్నప్పటికీ... ప్రభుత్వం పట్టించుకోవట్లేదని స్థానికులు అంటున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యటకంగా అభివృద్ధి చేస్తే కుంటాల, బోగత జలపాతాల మాదిరిగా రాచకొండ నిలిచిపోతుందని అంటున్నారు. అటవీ అధికారులు, ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే గొప్ప పర్యటక కేంద్రంగా మారే అవకాశం ఉందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'

Intro:tg_nlg_211_29_rachakonda_jalapatham_pkg_TS10117
యాంకర్: ఒకప్పుడు రాజులెలిన రాచకొండ... నేడు పచ్చదనంతో, జలపాతాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ ప్రాంతం పచ్చదనం, సెలయేళ్ల నీటి సవ్వడితో ఊటీని తలపిస్తోంది.50 అడుగుల ఎత్తు నుంచి జాలువరుతున్న రాచకొండ జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
vo1: ఇది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పూర్ మండలంలోని రాచకొండ అటవీ ప్రాంతం కాకతీయుల కాలం 13 వ శతాబ్దంలో రాచకొండ ఆస్థాన రాజధానిగా సుమారు 150 ఏళ్ళు పరిపాలించారు. రాచకొండ అటవీ ప్రాంతంలో10 గుట్టలు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రాచకొండ ప్రాంతంలోని గుట్టల్లో జాలువరుతున్న జలపాతాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ఈ రాచకొండ గుట్టల్లోని పల్లగట్టు తండా , కొండమూల తండాల్లో కొండలపైనుంచి 50 అడుగుల ఎత్తు నుంచి కిందకు జరుతున్న గంగమ్మ గలగలలు బోగత, కుంటాల జలపాతాలను తలపిస్తున్నాయి. నీటి సవ్వడులు వీణులవిందు చేస్తున్నాయి. ఆటవిలో రెండు కొండల మధ్య లో జాలువరుతున్న జలపాతాల అందాలు తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. జలపాతలలో కేరింతలు కొడుతూ ఆహ్లాదంగా గడుపుతున్నారు.సుందర దృశ్యాలు తమ చరవాణులలో బంధిస్తున్నారు.
బైట్1, శ్రీకాంత్, పర్యటకుడు
బైట్2, పవన్, స్థానికుడు
బైట్3, రాజు, ఇబ్రహీంపట్నం
vo2: ప్రకృతి అందాలకు నెలవు రాచకొండ. వర్షాకాలంలో ఈ ప్రాంతం సరికొత్త అందాలు సంతరించుకుంటుంది. గల గల పారే సెలయేళ్లు, జల జల పారే జలపాతాలు..కొండలు, కొనలు వాగులు వంకలు..అటవీ ప్రాంతంలో పాలలాంటి తెల్లని నీరు రెండు కొండల మధ్యలో నుంచి దూకుతూ ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తోంది. రెండు గుట్టల నడుమ జలపాతలలో స్నానాలు చేస్తూ ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. యాదాద్రి జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న నల్గొండ, రంగారెడ్డి, హైద్రాబాద్ జిల్లాలనుంచి ప్రజలు వస్తున్నారు.
బైట్, శ్రీకాంత్, పర్యటకుడు
evo: ఈ రాచకొండ ప్రాంతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో, నారాయణపురం మండలకేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాచకొండ ప్రాంతంలో జలపాతాలు సుందర ప్రదేశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని స్థానికులు అంటున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే కుంటాల, బోగత జలపాతాల మాదిరిగా రాచకొండ జలపాతం కూడా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. ఇక్కడికి రావటానికి రోడ్డు సదుపాయం కూడా లేకపోవటంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. అటవీ అధికారులు, ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే గొప్ప పర్యాటక కేంద్రంగా భాసిల్లే అవకాశం ఉంది.

Body:shiva shankar

Conclusion:9948474102
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.