తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ప్రజాప్రతినిధులను ఆర్టీసీ కార్మికులు కలిశారు. హన్మకొండలో ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యేలు వినయ్ భస్కర్, రాజయ్యను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఆర్టీసీ విలీనం మినహాయించి.. మిగతా అన్నింటినీ పరిష్కరించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని వినయ్‌భాస్కర్ అన్నారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ కార్మికులు ఇప్పటికైనా సమ్మెను విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండిః 'ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం'