వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని అనాధాశ్రమంలో కొప్పర్ల మంజుసాయినాథ్ రెడ్డి అనే బాలుడు ఆశ్రయం పొందుతున్నాడు. కాజీపేట ఫాతిమానగర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.
మరో 9 మంది ఆశ్రమ విద్యార్థులతో కలిసి రోజూ పాఠశాలకు వెళ్లేవాడు. ఈనెల 21న తరగతులు జరుగుతున్న సమయంలో బహిర్భూమికని వెళ్లిన బాలుడు తిరిగి రాలేదు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆశ్రమ నిర్వాహకులకు సమాచారం అందించగా.. వారు కాజీపేట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు.
- ఇదీ చూడండి : అభిరుచి భిన్నం... చరిత్ర పదిలం...