ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుతో పాటు పలువురు ప్రముఖులకు మంత్రి ఎర్రబెల్లి గ్రీన్ ఛాలెంజ్‌ను విసిరారు.
కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ హాజరై మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ పాత్రికేయులకు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను అందరూ స్వీకరించి మొక్కలు నాటడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః రామోజీరావుపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు