హుజూర్‌నగర్‌లో తెరాస అభ్యర్థి విజయంతో వరంగల్‌లో తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. హుజూర్‌నగర్‌లో తెరాస గెలుపు, ప్రజాగెలుపుగా మంత్రి అభివర్ణించారు. కాంగ్రెస్, భాజపా అభ్యర్థులను ఓడించి ప్రజలు చెంప చెళ్లుమనిపించారని తెలిపారు. హుజూర్నగర్ గెలుపుతోనైనా... విపక్ష నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై విమర్శలు మాని... అభివృద్ధితో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: ఈఎస్ఐ కుంభకోణంలో మరో మలుపు