ETV Bharat / state

యజమాని ఇంట్లో 60 లక్షలు చోరీ చేసిన దొంగల అరెస్టు

నమ్మకంగా యాజమాని ఇంటిలో పని చేస్తూ ఆ ఇంటిలోనే దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మధ్యప్రదేశ్‌ దొంగలను వరంగల్‌ అర్బన్ జిల్లా మట్వాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 50 లక్షల 40 వేల రూపాయాలను స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్​లో భారీ చోరీ... ఇంటి దొంగలు అరెస్టు
author img

By

Published : Nov 25, 2019, 9:43 PM IST

వరంగల్ నగరంలోని మట్వాడ ప్రాంతంలో గుజరాత్‌ క్లాత్‌ షోరూం పేరుతో యాకుబ్‌ అనే వ్యక్తి బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే తన స్నేహితుడికి పరిచయమైన మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన అబ్దుల్‌ వాహీద్‌ను బట్టల షాపులో సేల్స్‌మెన్‌గా నియమించుకున్నాడు. నమ్మకంగా పని చేస్తుంటం వల్ల యాకుబ్‌ తన ఇంటిలోనే పెట్టుకున్నాడు. బట్టల వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయాన్ని తన ఇంటిలోనే ఒక ట్రంక్ పెట్టెలో భద్రపర్చేవాడు. ఇది గమనించిన అబ్దుల్‌ వాహీద్‌ డబ్బును దొంగలించేందుకు ప్రణాళిక రూపొందించుకున్నాడు.

బట్టల దుకాణ యాజమాని వ్యాపార నిమిత్తం ఈనెల 11న బెంగుళూరుకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన నిందితుడు అబ్దుల్‌ వాహీద్‌ మధ్యప్రదేశ్‌లో ఉంటున్న మరో నిందితుడు అసీంఖాన్‌కు సమాచారం అందించాడు. ఇద్దరు కలిసి ఇంట్లో ఉన్న డబ్బు పెట్టెల తాళాన్ని పగులగొట్టి 63 లక్షలను చోరీ చేశారు. తిరిగి వచ్చిన దుకాణ యాజమాని ఇంట్లో చోరీ జరిగిందని గమనించి మట్వాడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈరోజు ఉదయం నగరంలో తిరుగుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న 50 లక్షల 40 వేల రూపాయాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ రవిందర్ తెలిపారు.

వరంగల్​లో భారీ చోరీ... ఇంటి దొంగలు అరెస్టు

ఇవీచూడండి: కాలాపత్తర్​లో దారుణం.. ఇంటి సమీపంలోనే వ్యక్తి హత్య

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.