ETV Bharat / state

ఓరుగల్లులో రూ. 900 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ

author img

By

Published : Dec 11, 2019, 8:15 PM IST

ఓరుగల్లు జిల్లాలో ప్రపంచ స్థాయి వస్ర్త పరిశ్రమ ఒకటి టెక్స్ టైల్ పార్కులో ఏర్పాటు కానుంది. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు గతంలో ఒప్పందం చేసుకున్న కొరియా టెక్స్‌టైల్ దిగ్గజం యంగ్వాన్ కార్పొరేషన్ ఈరోజు 900 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. భారీ పెట్టుబడి వచ్చిన సందర్భంగా మంత్రి కె.తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు.

huge industry with an investment of Rs 900 crore at warangal
ఓరుగల్లులో రూ. 900 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ

వరంగల్​లో ఓ ప్రపంచ స్థాయి టెక్స్‌టైల్ పరిశ్రమ రూ. 900 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుంది. వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో యూనిట్ స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వంతో కార్పొరేషన్ ఈరోజు తుది ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పరిశ్రమకు అవసరమైన భూ కేటాయింపు పత్రాలను కంపెనీ అందుకుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, యంగ్వాన్ కార్పొరేషన్ ఛైర్మన్ కిహాక్ సుంగ్ కంపెనీ ప్రతినిధి బృందం, భారత్, కొరియా రాయబారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్వాన్ కార్పొరేషన్ ఒక యూనిట్​గా ఉంటుంది. అందుకోసం 290 ఎకరాల భూమి కేటాయింపు పత్రాలను ప్రభుత్వం అందించింది. స్థానికంగా లభించే అత్యుత్తమ కాటన్ ఉత్పత్తిని ఉపయోగించుకుని ఎగుమతులే లక్ష్యంగా, యంగ్వాన్ వివిధ రకాల టెక్స్‌టైల్ ఉత్పత్తులను తయారు చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సూమారు 12 వేల మందికి ఉపాధి లభించనున్నదని, యంగ్ వన్ పెట్టుబడి ద్వారా వరంగల్ టెక్స్‌టైల్ పార్కుకి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి : 'హిందువులకు తెరాస క్షమాపణ చెప్పాలి'

TG_HYD_50_11_BIG_INVESTMENT_TO_WGL_AV_3181965 REPORTER : PRAVEEN NOTE : FEED TO DESK WHATSAPP ( ) వ్యవసాయ రంగం తర్వాత అంతటి స్థాయిలో ఉపాధి కల్పిస్తోన్న టెక్స్‌టైల్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వరంగల్లో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కానుందని పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు తెలిపారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్క్ కి భారీ పెట్టుబడి వచ్చిన సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు గతంలో అవగాహన ఒప్పందం చేసుకున్న కొరియా టెక్స్‌టైల్ దిగ్గజం యంగ్వాన్ కార్పొరేషన్, ఈరోజు 900కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో యూనిట్ స్థాపన కోసం తెలంగాణ ప్రభుత్వంతో కార్పొరేషన్ ఈరోజు తుది ఒప్పందాన్ని, పరిశ్రమకు అవసరం అయిన భూ కేటాయింపు పత్రాలను కంపెనీ అందుకుంది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, యంగ్వాన్ కార్పొరేషన్ చైర్మన్ కిహాక్ సుంగ్ కంపెనీ ప్రతినిధి బృందం, భారత్, కొరియా రాయబారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్వాన్ కార్పొరేషన్ యాంకర్ యూనిట్ గా ఉంటుంది. ఇందుకోసం సుమారు 900 కోట్ల రూపాయల పెట్టుబడిని పెడుతోంది. యంగ్ వన్ టెక్స్‌టైల్ యూనిట్ స్థాపన కోసం 290 ఎకరాల భూమి కేటాయింపు పత్రాలను ప్రభుత్వం అందించింది. ఈ యూనిట్ స్థాపన ద్వారా ప్రపంచ స్థాయి టెక్స్‌టైల్ పరిశ్రమ ఒకటి, వరంగల్ టెక్స్ టైల్ పార్కులో ఏర్పాటు కానుంది. స్థానికంగా లభించే అత్యుత్తమ కాటన్ ఉత్పత్తిని ఉపయోగించుకొని ఎగుమతులే లక్ష్యంగా, యంగ్వాన్ వివిధ రకాల టెక్స్‌టైల్ ఉత్పత్తులను తయారుచేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సూమారు 12 వేల మందికి ఉపాధి లభించనున్నదని, యంగ్ వన్ పెట్టుబడి ద్వారా వరంగల్ టెక్స్‌టైల్ పార్క్ కి మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.