కులం, మతం, రంగు, భాష.. ఇలాంటివేవీ ప్రేమకు అడ్డుకావని మరోసారి నిరూపించారు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుని మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హన్మకొండకు చెందిన దినేష్ బాబు ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అక్కడే డెమీ పరిచయం అయింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో వారిద్దరూ ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
విదేశీ వధువు తెలుగు సంప్రదాయ పద్థతిలో చీరకట్టుకొని అందంగా ముస్తాబయింది. బంధుమిత్రులతోపాటు.. పలువురు విదేశీ అతిథులు కూడా పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, చాలా గొప్పవని... వధువు డెమీ మార్గెరెట్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి