వరంగల్ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకలో ఓ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన అందెబోయిన సదయ్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. పరకాలకు చెందిన గడ్డం శ్రీకాంత్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు కాజేసి పారిపోతుండగా గుర్తించిన స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.
కూతురి పెళ్లికోసం కూడబెట్టిన సుమారు 25 లక్షల విలువైన ఆభరణాలు, నగదు అపహరిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: లింగ నిర్ధరణ చేసిన ఆస్పత్రి సీజ్