ETV Bharat / state

వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు - 70 నుంచి 80 మందికి గర్భసంచి తొలగింపు

వారికి అర్హత లేదు.. అనుభవంతో పనేలేదు.. మెడలో స్టెతస్కోపు, చేతిలో కత్తెర ఉంటే చాలు.. డాక్టర్‌ అవతారం ఎత్తడం.. ఏ చిన్న సమస్యతో వచ్చినా మహిళలను భయపెట్టడం. పాతిక, ముప్పై వేల సొమ్ము కోసం అమాయకులైన గూడెం మహిళల కడుపులకు కోత పెట్టడం వారి రోజు వారి విధి.

వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు
వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు
author img

By

Published : Dec 24, 2019, 3:16 PM IST

వైద్యులు కాదు వారు ఆగర్భ శత్రువులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని తండాల్లో గ్రామీణ మహిళల అమాయకత్వం, నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని కొందరు వైద్యులు కాసులు కొల్లగొడుతున్నారు. ఏ చిన్న రోగం వచ్చినా.. నొప్పులని వైద్యశాలకు వెళ్లినా.. గర్భసంచి తొలగిస్తే అన్ని సమస్యలు ఇట్టే పరిష్కారమైపోతాయని అపోహలు కల్పిస్తున్నారు. లేని పోని అనుమానాలతో మహిళలను భయాభ్రాంతులకు గురిచేస్తున్నారు. గడ్డ అయిందంటూ.. గర్భసంచి తీసివేయాలంటూ.. తీయకపోతే ప్రాణాలకే ప్రమాదమని తప్పుతోవ పట్టిస్తున్నారు. తండాల్లో కొందరు ఆర్‌ఎంపీలు తిష్ఠ వేసి ఇదే పని మీద ఉంటున్నారు. వారి మాటలను నమ్మి.. గర్భసంచి తొలగింపుతో భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల గురించి తెలియక చాలామంది మహిళలు శస్త్రచికిత్స చేయించుకొని నానా తంటాలు పడుతున్నారు. ఈ చికిత్సలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారు. అచ్చంపేట మండలం ఐనోల్‌లో 53 మంది మహిళలకు గర్భసంచి తొలగించగా.. వీరంతా అచ్చంపేటలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు.

నాకు తరచూ కడుపునొప్పి వచ్చేది. ఆసుపత్రికి వెళితే గర్భసంచిపై చిన్నచిన్న బొబ్బలు వచ్చాయన్నారు. మూడేళ్ల కిందట గర్భసంచి తొలగించారు. బరువు పనులు చేయడం ఇబ్బందిగా ఉంది. - 27 ఏళ్ల మహిళ

నడుం నొప్పితో వెళితే..

నా వయసు 38 ఏళ్లు. తరచూ నడుంనొప్పితో తెల్లబట్ట అధికంగా వచ్చేది. స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వద్దకు వెళ్లా. కొన్నిరోజులు మాత్రలు ఇచ్చినా తగ్గలేదు. గర్భసంచి తీసివేయాలన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లి గర్భసంచి తొలగించారు. వారంరోజులపాటు ఆస్పత్రిలోనే ఉన్నాం. రూ.30 వేల వరకు ఖర్చు అయింది. ఇపుడు నడుంనొప్పి ఎక్కువై పనులు సక్రమంగా చేసుకోలేకపోతున్నా. - ఓ మహిళ, ఎన్కి తండా, ఖిల్లాగణపురం

గతంలో బాగా పనులు చేసేదాన్ని..

నా వయసు 30. ఆర్‌ఎంపీ వద్దకు వెళితే పుండు వచ్చిందని గర్భసంచి తీసివేశారు. ఫీజు రూ.20 వేలు తీసుకున్నారు. ఆస్పత్రిలో మరో రూ.5 వేలు ఖర్చు అయ్యింది. ఆపరేషన్‌ చేసినప్పటి నుంచి కడుపులో నొప్పిగా ఉంది. గతంలో పనులు బాగా చేసేదాన్ని. ఇపుడు చేసుకోలేకపోతున్నా. - ఓ మహిళ, ఎన్కి తండా, ఖిల్లాగణపురం

70 నుంచి 80 మందికి గర్భసంచి తొలగింపు..

వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలంలోని ఎన్కి తండా జనాభా 932. అందులో మహిళలు 460. వీరిలో 70 నుంచి 80 మందికి గర్భసంచిని తొలగించారు. ఇటీవల ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ విషయం బయటకు వచ్చింది. ఎన్కితండా చుట్టుపక్కల గ్రామాల్లోనూ గర్భసంచిని తొలగించుకున్నవారు పదుల సంఖ్యలో ఉన్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట మండలంలోని ఐనోలు గ్రామ జనాభా 1,616. ఇందులో మహిళలు 816. ఈ గ్రామంలో 53 మంది మహిళలు తమ గర్భసంచులను తొలగించుకున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇలా 318 తండా గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి కింద మరో మూడు వేల వరకు అనుబంధ తండాలున్నాయి. చాలా తండాల్లో ఇదే దుస్థితి.
కాసుల కక్కుర్తితో మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ఆర్​ఎంపీలపై అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు కోరుతున్నారు.

ఇవీ చూడండి:

Intro:tg_mbnr_02_24_garba_shartuvulu_pkg_ts10053

Body:tg_mbnr_02_24_garba_shartuvulu_pkg_ts10053

Conclusion:tg_mbnr_02_24_garba_shartuvulu_pkg_ts1
0053
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.