ETV Bharat / state

వీడిన చిక్కుముడి... ప్రియుడే హంతకుడు - women murder in vikarabad

ఆగస్టు 21న వికారాబాద్​లో జరిగిన మహిళ హత్య కేసును వికారాబాద్‌ పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం వికారాబాద్‌ పట్టణ ఠాణాలో సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌ఐ సుస్మిత ఈ వివరాలు వెల్లడించారు.

వీడిన చిక్కుముడి... ప్రియుడే హంతకుడు
author img

By

Published : Nov 7, 2019, 10:39 AM IST

Updated : Nov 7, 2019, 10:51 AM IST

వికారాబాద్‌లో ఆగస్టు 21న హత్యకు గురైన గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హతురాలి చిరునామా దొరికినందున... కేసు చిక్కుముడి వీడిపోయింది. దశాబ్దంన్నర క్రితం మర్పల్లి మండలానికి చెందిన యువతికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. చాన్నాళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. వీరికి 13 ఏళ్ల కూతురు, 10 ఏళ్ల కొడుకు ఉన్నారు.

రెండేళ్ల క్రితం ఆమెకు మర్పల్లి మండలం మల్లికార్జునగిరికి చెందిన పద్మారావుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే పద్మారావుకు పెళ్లై భార్య, ఓ బాబు, పాప ఉన్నారు. ఆమె పిల్లలతో సహా పద్మారావు పంచన చేరింది. కొన్ని రోజులు సదాశివపేటలో ఓ గదిని అద్దెకు తీసుకొని వారిని అక్కడే ఉంచాడు. మూడు మాసాల క్రితం మకాం మార్చి వికారాబాద్‌ పట్టణంలోని ఎన్నెపల్లిలోని ఓ అద్దె గదిలో ఉంచాడు. ఈ క్రమంలో ఆమె ఇతరులతో చనువుగా ఉండటాన్ని పద్మారావు గుర్తించాడు.

ఇంట్లో కిరోసిన్‌ అయిపోయినందున వంట చేయకుండా... హోటల్‌ నుంచి భోజనం పార్సిల్‌, మద్యం తెచ్చుకొని మహవీర్‌ ఆస్పత్రి సమీపంలో తాగి తిన్నారు. ఇతరులతో చనువుగా ఉండటాన్ని పద్మారావు ప్రస్తావించగా... ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో కర్రతో తలపై తీవ్రంగా కొట్టి చంపి, ఏమీ ఎరగనట్టుగా వెళ్లిపోయాడు. తల్లి కనిపించని విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమె పిల్లల్ని బెదిరించి ఇంటి గడప దాటకుండా కట్టడి చేశాడు. పద్మారావు కూలి పనికి బయటికి వెళ్లగా, పిల్లలు తప్పించుకొని తమ తండ్రి వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. ఆయన వికారాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితుడు పద్మారావును అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చూడండి: ద్విచక్రవాహనంపై నుంచి పడి మహిళ మృతి

sample description
Last Updated : Nov 7, 2019, 10:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.