వికారాబాద్ జిల్లా పరిగి బీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై(11) అదే కాలనీకి చెందిన సాయి అనే యువకుడు(26) అత్యాచారం చేశాడు. బాలికకు మాయ మాటలు చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లిన యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు.
బాలికకు తీవ్ర రక్తస్రావం కావడం వల్ల కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి ఆరాతీయగా విషయం బయటపడింది. ఘటన జరిగిన రాత్రి ... బాలిక తొమ్మిందిటి వరకు ఇంటికి రాకపోవడం వల్ల ఆమె కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు.అంతలోనే బాలిక ఇంటికి రావడం వల్ల దారుణం బయటపడింది. కాలనీవాసులు ఆ యువకుణ్ణి పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలికకు తల్లిదండ్రులు చనిపోవడంతో తన మేనమామ దగ్గర ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.