ప్రేయసికోసం ఓ యువకుడు మతం మారాడు. మనసుపడ్డ మగువ కోసం 11 నెలల శిక్షణ తీసుకున్నాడు. తీరా పెళ్లి విషయం వచ్చేసరికి యువతి తరఫువారు మాట మార్చారు. తనకు న్యాయం చేయాలంటూ ఆ యువకుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
ప్రేమకు అడ్డంగా మారిన మతం
వికారాబాద్‌కు చెందిన బొబ్బిలి భాస్కర్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ హునైన్... అదే ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం యువతి ప్రేమించుకున్నారు. చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. డిగ్రీ పూర్తి చేసిన తరవాత తమ ప్రేమ విషయాన్ని ఇరుపెద్దల ముందు ఉంచారు. వీరిద్దరు మతాలు వేరవడం వల్ల యువతి తరఫువారు పెళ్లికి నిరాకరించారు.
అప్పుడు సరే అన్నారు.. ఇప్పుడు...
వేరే మతానికి చెందిన భాస్కర్‌ను మత మార్పిడి చేసుకుంటే వివాహానికి ఒప్పుకుంటామని షరతు పెట్టారు. ప్రేయసి కోసం దిల్లీలో 11 నెలల శిక్షణ తీసుకుని ఆ యువకుడు ఇస్లాంమత మార్పిడి చేసుకున్నాడు. తాండూరులోని ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి మత ధ్రువీకరణ పత్రాన్ని పొందాడు. అనంతరం యువతి ఇంటికెళ్లి పెళ్లి విషయం ఎత్తగా వారు ముఖం చాటేశారంటూ వాపోతున్నాడు. యువతి కుటుంబ సభ్యులు తనపై దాడికి యత్నించారంటూ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ బాధితుడి న్యాయం కోసం మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
ప్రేమించిన యువతితో వివాహం జరిపించేలా చర్యలు తీసుకొని, వారిద్దరికి ప్రాణ రక్షణ కల్పించాలని మహమ్మద్ అబ్దుల్... హెచ్ఆర్సీని వేడుకున్నాడు.
ఇదీ చూడండి: సమత కేసు తీర్పుపై ప్రాసిక్యూషన్, డిఫెన్స్ న్యాయావాదులేమన్నారంటే..