హుజూర్‌నగర్ ప్రజా కృతజ్ఞత సభలో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యే సైదిరెడ్డి నృత్యాలు చేసి కార్యకర్తలను ఆకట్టుకున్నారు. కార్యకర్తలు, కళాకారులతో కలిసి తెలంగాణ జానపద గీతాలకు ఉత్సాహంతో స్టెప్పులేశారు. వేదికపైన సైదిరెడ్డి పాదం కదపగా... అరుపులతో ప్రజలంతా ఉత్సాహపరిచారు. హుజూర్‌నగర్‌లో రికార్డు మెజార్టీతో విజయం సాధించిన సైదిరెడ్డి విజయోత్సాహంతో ఆడిపాడగా... సభాప్రాంగణమంతా ఈలలు, చప్పట్లతో మారుమోగిపోయింది.
ఇది చదవండి: జాతరలో వెంకీమామ యాక్షన్ పాఠాలు...!