ETV Bharat / state

అభిరుచి భిన్నం... చరిత్ర పదిలం...

'ద్రవ్య కొలమానం' చిన్నప్పుడు బడిలో చెప్పిన పాఠం గుర్తొస్తుంది కదా...! నిజమేనండి.. మరి దీనిగురించి ఇప్పుడెందుకంటారా..? ఇలా పాఠాలు చెప్పే ఓ ఉపాధ్యాయుడికి తట్టిన వినూత్న ఆలోచనే అతనికి పురాతన నాణాలు సేకరించే ప్రవృత్తిగా మారింది. విద్యార్థులకు ద్రవ్య కొలమానంపై అవగాహన కల్పించేందుకు దాదాపు 100 దేశాలకు చెందిన కరెన్సీని సేకరించి అబ్బూరపరుస్తున్నారు.

author img

By

Published : Nov 23, 2019, 6:37 AM IST

govt teacher collecting different coins

ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. అలాంటి అభిరుచిని ఆచరణలో పెట్టే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందినవారే సూర్యాపేట జిల్లా మునగాల మండల ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు సిరంగి రంగారావు. ఇప్పటివరకు 100 దేశాల కరెన్సీని సేకరించి వందకు పైగా పాఠశాలల్లో ప్రదర్శనలు ఇచ్చి విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. బోధన వృత్తిగా.. నాణేల సేకరణ ప్రవృత్తిగా వివిధ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను కల్పిస్తూ అందరి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

దశాబ్ద కాలం నుంచి సేకరణ...

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన సిరంగి రంగారావు 10 సంవత్సరాలుగా మునగాల మండలంలోని ముకుందాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం 3,4,5 తరగతుల విద్యార్థులకు 'ద్రవ్య కొలమానం' అనే అంశంపై బోధించేందుకు నాణాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వారి కుమారుల ప్రోత్సాహంతో విదేశీ కరెన్సీ, ప్రాచీనకాలం నాటి నాణేలను సేకరించాడు. అలా ఇప్పటివరకు ఆయన సేకరించిన నాణేలల్లో క్రీ.పూ 1000వ సంవత్సరానికి చెందిన చైనా పురాతన నాణెం కూడా ఉంది. వీటితోపాటు పైసా, అణా, బేడాలతో పాటు బ్రిటిష్ కాలం నాటి చిల్లిపైసా, అర్ధ అణా, వెండి నాణాలు, శివాజీ ఛత్రపతి మహారాజ్ కాలం నాటి నాణేలను సేకరించారు.

ఆశ్చర్యపోతున్న విద్యార్థులు...

వివిధ దేశాల కరెన్సీకి మన దేశ కరెన్సీకి ఉన్న వ్యత్యాసం, వివిధ కాలాల్లో వివిధ దేశాల్లో అమలులో ఉన్న ద్రవ్యాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చేయడంలో ఈ ఆదర్శ ఉపాధ్యాయుడు సఫలమయ్యారు. విద్యార్థులు కూడా తాము ఎప్పుడూ చూడలేనటువంటి పురాతన నాణేలు చూసే అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అభిరుచి భిన్నం... చరిత్ర పదిలం...

మునగాల పరగణా నాణేల సేకరణ...

మునగాల పరగణాలోని జమీందార్ల కాలంలో చలామణి అయిన నాణేలను కూడా రంగారావు సేకరించారు. అలాగే ఈస్టిండియా కంపెనీకి చెందిన 1835 సంవత్సరం నాటి నాణేలు ఆయన వద్ద ఉన్నాయి. ఇప్పటి వరకు 100 ప్రదర్శనలు ఇచ్చిన రంగారావుకు 2012లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక అయ్యారు. రంగారావు చేస్తున్న ప్రయత్నం అనితర సాధ్యమని ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు అంటున్నారు.

ఇవీ చూడండి;'హయత్ నగర్​లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... 3 ఇళ్లల్లో చోరీ'

Intro:అభిరుచి భిన్నం....చరిత్ర పదిలం

( )
ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అభిరుచి అలాంటి అభిరుచిని ఆచరణలో పెట్టే వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవకు చెందిన వారే మునగాల మండలం లోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడు సిరంగి రంగారావు. ఇప్పటివరకు 100 దేశాల కరెన్సీని సేకరించి వందకు పైగా పాఠశాలల్లో ప్రదర్శనలు ఇచ్చి విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. బోధన వృత్తిగా నాణేల సేకరణ ప్రవృత్తిగా వివిధ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను కల్పిస్తూ అందరి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ ఉత్తమ ఉపాద్యాయుడు...

@@VO@
సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన సిరంగి రంగారావు 10 సంవత్సరాలుగా మునగాల మండలంలోని ముకుందాపురం ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 10 సంవత్సరాల క్రితం 3,4,5 తరగతుల విద్యార్థులకు ద్రవ్య కొలమానం అనే అంశంపై బోధించేందుకు నాణాలు సేకరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వారి కుమారులు సునీల్,సంపత్ ల ప్రోత్సాహంతో విదేశీ కరెన్సీ ప్రాచీన కాలంనాటి నాణేలను సేకరించాడు.. ఇప్పటివరకు ఆయన సేకరించిన నాణేలల్లో క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరానికి చెందిన చైనా పురాతన నాణెం ఉంది. వీటితోపాటు పైసా,అణ,బేడా బ్రిటిష్ కాలం నాటి చిల్లిపైసా, అర్ధ అణ, వెండి ద్రవ్యం, శివాజీ చత్రపతి మహారాజ్ కాలం నాటి నాణేలను సేకరించారు. విదేశాలకు చెందిన కరెన్సీ అమెరికానాణేలు, ఖత్తర్ డాలర్, కువైట్ దినార్, సింగపూర్ నాణేలు, రోమన్, నైజీరియా కరెన్సీ ఎక్కువగా సేకరించారు భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనకు ముందు ఆ తర్వాత కాలంలో చలామణి అయిన నాణేలను సేకరించి పలువురికి చూపుతూ అవగాహన కల్పిస్తున్నారు.

@@మునగాల పరగణా నాణేల సేకరణ@
మునగాల పరగణా లోని జమీందార్ల కాలంలో చలామణి అయిన నాణేలు సేకరించి భద్రపరిచారు. అలాగే ఈస్టిండియా కంపెనీకి చెందిన 1835 సంవత్సరంపు నాణేలను సేకరించారు.... 2012లో ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక అయ్యారు...

@@ఆసక్తిగా తిలకిస్తున్న విద్యార్థులు@
ఇప్పటి వరకు 100 ప్రదర్శనలు ఇచ్చిన రంగారావుగారు విద్యార్థులు,ఉపాధ్యాయుల నుంచి అభినందనలు అందుకుంటున్నాడు. పాఠ్యపుస్తకాలకు పరిమితమయ్యే పురాతన నాణేలు,బ్రిటిష్ కాలం కంటే ముందు ఉన్న నాణేలు, విద్యార్థుల తాత ముత్తతల కాలంలో ఉన్న నాణేలను ప్రత్యక్షంగా చూడడం చాలా అనుభూతిగా ఉందని విద్యార్థులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రంగారావు గారి ప్రయత్నం అనితర సాధ్యం...bytes

1బైట్:::కావ్య::విద్యార్థిని
2బైట్:::సంజన::విద్యార్థిని
3బైట్:::హారిక::విద్యార్థిని
4బైట్::శ్రీనివాసరావు::సహా ఉపాధ్యాయుడు
5బైట్:::సిరంగి రంగారావు:::నాణేల సేకరణ కర్త.

Body:కెమెరా అండ్ రెపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్:::9502802407

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.