ETV Bharat / state

' రాష్ట్రంలో ప్రతీ ఇంచుకు నీళ్లు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం ' - CM KCR said 'We are trying to bring water to every edge of the telangana state'

తెలంగాణలో ఎక్కడా నీళ్లు రాకపోయినా ఆ బాధ తనకు ఉంటుందని సీఎం కేసీఆర్​ తెలిపారు. రాష్ట్రంలో ప్రతీ ఇంచుకు నీళ్లు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేశారు. నీటి కేటాయింపుల్లో తొలి నుంచి తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. నల్గొండ జిల్లా సాగునీటి సమస్యలు శాశ్వతంగా తొలగిపోవాలంటే... సాగర్‌ ఆయకట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. గోదావరి నీళ్లు నాగార్జునసాగర్‌ ఎడమకాలువలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. గతంలో తాను నల్గొండ జిల్లా ఇంఛార్జ్‌ మంత్రిగా ఉన్నప్పుడున్న సమస్యలు నేటికి అలాగే ఉన్నాయని... గత పాలకులు చేసిందేమీ లేదని విమర్శించారు. సాగర్‌ ఆయకట్టు సమస్యలు తెలుసుకునేందుకు త్వరలోనే జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తానని సీఎం తెలిపారు.

CM KCR said 'We are trying to bring water to every edge of the telangana state'
author img

By

Published : Oct 26, 2019, 6:28 PM IST

Updated : Oct 26, 2019, 6:39 PM IST

.

' రాష్ట్రంలో ప్రతీ ఇంచుకు నీళ్లు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం '

.

' రాష్ట్రంలో ప్రతీ ఇంచుకు నీళ్లు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం '
Last Updated : Oct 26, 2019, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.