![Bride groom Suicide in Suryapeta district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5609853_letter.jpg)
సూర్యాపేటలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన నెల రోజులలోపే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడాడు. పట్టణంలో శ్రీరాంనగర్‌కు చెందిన వంగపల్లి అర్జున్‌కుమార్ వివాహం డిసెంబర్ 8న ఆత్మకూర్ (ఎస్) మండలానికి చెందిన యువతితో జరిగింది. డిసెంబరు 26న అర్జున్‌కుమార్ సంసారానికి పనికిరాడని ఆ యువతి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆత్మకూర్ (ఎస్) పోలీసు స్టేషన్లో మోసం చేసి పెళ్లిచేశారని అర్జున్‌కుమార్‌తో పాటు తల్లి, సోదరుడు, అక్కబావలపై ఫిర్యాదు చేసింది.
ఈనెల 3న పోలీసులు వీరిని కౌన్సెలింగ్‌కు ఠాణాకు పిలిచారు. పెద్ద మనుషుల సమక్షంలో అతని భార్య, అత్త హేళనగా మాట్లాడారు. ఈనెల 11న మరోసారి కౌన్సెలింగ్‌కు రావాలని చెప్పి పంపించారు. మనస్తాపం చెందిన అర్జున్‌కుమార్ శనివారం రాత్రి పడక గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని చీరతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనుమానం వచ్చి ఎంత పిలిచినా స్పందించకపోవటం వల్ల బలవంతంగా తలుపులు తెరిచి చూసేసరికి ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే కిందికి దించి 108 వాహనంలో సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అతని జేబులో స్వీయలేఖను బంధువులు గుర్తించారు. మృతుడి తల్లి వంగపల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: ఆన్లైన్ ఆఫర్లే గాలం... మార్కెట్లోకి సరికొత్త సైబర్‌మోసం!