ETV Bharat / state

కుటుంబం సహా ట్యాంక్​ ఎక్కిన కాంట్రాక్టర్ - విషయం తెలుసుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు బాధిత కుటుంబానికి నచ్చజెప్పారు

మిషన్ భగీరథ ట్యాంక్​ పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించకుండా తిప్పుకుంటున్నారని ఆవేదనకు గురైన ఓ సబ్ కాంట్రాక్టర్ కుటుంబంతో సహా నిర్మించిన ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా​లో చోటుచేసుకుంది.

భగీరథ బిల్లులు రాలేదని ట్యాంక్ ఎక్కిన కాంట్రాక్టర్
author img

By

Published : Oct 31, 2019, 12:35 PM IST

పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా తమకు పూర్తి బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ సబ్ కాంట్రాక్టర్ కుటుంబంతో సహా ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు బాధిత కుటుంబానికి నచ్చజెప్పారు.

బిల్లులు వచ్చే విధంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ హామీ ఇచ్చాక కిందకు దిగారు. మూడు గంటల ఉత్కంఠ తర్వాత క్షేమంగా దిగడం పట్ల అందరూ ఊపిరి పిల్చుకున్నారు.

సూర్యాపేట జిల్లాలో 20 నెలల క్రితం అనంతారం, కుసుమవారి గూడెం గ్రామాలలో రెండు నీటి ట్యాంకులకు సబ్ కాంట్రాక్టర్ శంకర్ జీవీపీఆర్​ కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకున్నారు. సుమారు కోటీ ఇరవై లక్షల వ్యయంతో 40 వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకులకు నిర్మించారు.

అయితే ఇప్పటి వరకు 80 లక్షల బిల్లు మాత్రమే చెల్లించారని, ఇంకా రావాల్సిన 46 లక్షల బిల్లు పెండింగ్​లో పెట్టారని శంకర్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. అయినా ఫలితం దక్కలేదు.

కంపెనీ ప్రతినిధులు తమకు సరైన ఒప్పందం లేకుండా కేవలం వర్క్ ఆర్డర్ మాత్రమే ఇచ్చి పనులు చేయించారని, పనులు చేసే క్రమంలో అంచనాలకు మించి ఎక్కువ మెటీరియల్​ను భగీరథ అధికారులు పెట్టించారని శంకర్​ అన్నారు. ఎక్కువ పెట్టిన మెటీరీయల్ సొమ్మును తమకు తెలియకుండా స్థానిక డీఈ నరేశ్, హైద్రాబాద్​కు చెందిన జీవీపీఆర్​ కంపెనీతో కుమ్మక్కై నొక్కే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.

భగీరథ బిల్లులు రాలేదని ట్యాంక్ ఎక్కిన కాంట్రాక్టర్

ఇదీ చూడండి : కరీంనగర్​లో బంద్​.. ఆర్టీసీ కార్మికుల అరెస్టులు

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.