సిద్దిపేట జిల్లా కేంద్రంలో చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన నలుగురు వార్డు సభ్యులు, ఒక ఉప సర్పంచ్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన ఎనిమిది లక్షల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉంచి, డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారని ఆకునూరు గ్రామ సర్పంచ్ చీపురు రేఖపై ఆరోపించారు.
సర్పంచ్‌పై చర్యలు తీసుకుని తమకు రావాల్సిన బిల్లులు మంజూరు చేయాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చూడండి : కమ్ముకున్న మంచు దుప్పటి