హుస్నాబాద్ పట్టణంలో పట్టపగలే రెండు ఇళ్లలో దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీకి పాల్పడ్డారు. అక్కన్నపేట రోడ్డులోని బాలాజీ నగర్లో నివాసముండే శైలజ హుస్నాబాద్ డిపోలో కండక్టర్గా పనిచేస్తుంది. సోమవారం సమ్మెలో పాల్గొనేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లింది. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనించిన దొంగలు గేట్ పైనుంచి దూకి లోపలికి వెళ్లారు. ఇంటి తాళన్ని పగలగొట్టి బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు, వెయ్యి రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. మరో ఘటనలో ఎల్లంబజార్కు చెందిన బత్తుల బాబు ఇంట్లో సైతం దొంగతనానికి పాల్పడ్డారు. బాబు తన ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లగా... తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న ఎనిమిది వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని... సిద్దిపేట నుంచి క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.
ఇవీచూడండి: చేపల వేటకు వెళ్లి తిరిగిరాలేదు