ఆడ పిల్లల విషయంలో పాటిస్తున్న జాగ్రత్తలు.. మగ పిల్లల విషయంలో కూడా ఉండాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. పిల్లలు సినిమాకు, చెడు తిరుగుళ్లకు వెళ్తున్నారా... లేక కళాశాలకు వెళ్తున్నారా అనేది పరిశీలించాలన్నారు. తల్లిదండ్రులు అమ్మాయిలను కాదు జాగ్రత్తగా చూసుకోవాల్సింది అబ్బాయిలను అని తెలిపారు. మగ పిల్లలకి కూడా సామాజిక బాధ్యతలను తెలియజేయాలని సూచించారు.
ఆడ, మగ పిల్లలు ఇద్దరిని ఒకేతీరుగా చూడాలన్నారు. ఒకే తీరుగా చదివించాలన్నారు. చదువుకునే పిల్లలని వ్యవసాయ పనులకు తీసుకుపోవద్దు, వాళ్ల చదువులను దెబ్బతీయద్దొని కోరారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
ఇదీ చూడండి : విధులకు వెళ్తున్నానని చెప్పిన యువతి... అదృశ్యం