ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. పట్టణంలోని కుశాల్నగర్కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మురళి, లతల రెండో కుమారుడు సంతోష్(20) సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఓ యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవల అకస్మాత్తుగా యువతి తన ప్రేమను తిరస్కరించడం వల్ల యువకుడు మనస్తాపం చెందాడు. ప్రేమికురాలు దక్కలేదని బాధతో జీవితంపై నిరాశ చెందిన సంతోష్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సంతోశ్ స్నేహితులు ఫోన్ ఎత్తడం లేదని ఆ ఇంటి వైపు వెళ్లి చూశారు. మూసి ఉన్న తలుపులను బలవంతంగా తెరిచి చూడగా మృతి చెంది ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : వైభవంగా జడ్పీ ఛైర్పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక